విశ్వాసం కనుమరుగైంది.. అందుకే గేట్స్‌కు విడాకులిచ్చా : మెలిండా
దిశ, నేషనల్ బ్యూరో : ప్రపంచ కుబేరుడు, మైక్రోసాఫ్ట్ అధినేత బిల్‌గేట్స్ నుంచి విడాకులు తీసుకున్న అంశంపై మెలిండా ఫ్రెంచ్ గేట్స్ కీలక వ్యాఖ్యలు చేశారు.
దిశ, నేషనల్ బ్యూరో : ప్రపంచ కుబేరుడు, మైక్రోసాఫ్ట్ అధినేత బిల్‌గేట్స్ నుంచి విడాకులు తీసుకున్న అంశంపై మెలిండా ఫ్రెంచ్ గేట్స్ కీలక వ్యాఖ్యలు చేశారు. బిల్‌గేట్స్ నుంచి విడాకులు తీసుకోవాల్సి వస్తుందని తాను ఎన్నడూ అనుకోలేదన్నారు. ప్రముఖ యూట్యూబర్ జే శెట్టికి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆమె ఈ కామెంట్స్ చేశారు. 59 ఏళ్ల వయసులో విడాకుల గురించి ఆలోచించాల్సి వస్తుందని కలలో కూడా తాను ఊహించలేదని మెలిండా పేర్కొన్నారు. విడాకులు తీసుకున్న సమయమే తన జీవితంలో అత్యంత కష్టతరమైన అంశమని ఆమె చెప్పారు.
‘‘బిల్ గేట్స్‌కు, నాకు మధ్య పరస్పర విశ్వాస భావన లేకుండా పోయింది. విశ్వాసానికే చోటులేకుండా పోయినప్పుడు ఆ దాంపత్య బంధానికి ఇంకా అర్థమేం ఉంటుంది ? అందుకే బిల్ గేట్స్ నుంచి విడాకులు తీసుకోవాలని నేను నిర్ణయించుకున్నాను’’ అని మెలిండా పేర్కొన్నారు. బిల్ గేట్స్ - మెలిండాల 27 ఏళ్ల వివాహ బంధం 2021 మే నెలలో విడాకులతో తెగిపోయింది.