Mayawati comments: ఎస్పీలో పీడీఏ కమ్యూనిటీకి స్థానం లేదు.. బీఎస్పీ చీఫ్ మాయవతి

ఉత్తరప్రదేశ్ అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా సమాజ్ వాదీ పార్టీ(ఎస్పీ) సీనియర్ నేత మాతా ప్రసాద్ పాండేను నియమించడంపై బహుజ్ సమాజ్ వాదీ పార్టీ(బీఎస్పీ) చీఫ్ మాయవతి విమర్శలు గుప్పించారు.

Update: 2024-07-29 12:30 GMT

దిశ, నేషనల్ బ్యూరో: ఉత్తరప్రదేశ్ అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా సమాజ్ వాదీ పార్టీ(ఎస్పీ) సీనియర్ నేత మాతా ప్రసాద్ పాండేను నియమించడంపై బహుజ్ సమాజ్ వాదీ పార్టీ(బీఎస్పీ) చీఫ్ మాయవతి విమర్శలు గుప్పించారు. పీడీఏ కమ్యూనిటీ (వెనుకబడిన తరగతులు, దళితులు, మైనారిటీ)లకు ఎస్పీలో స్థానం లేదన్నారు. ఈ వర్గాల ప్రజల అభ్యున్నతికి ఎస్పీ ఏమీ చేయలేదని ఆరోపించారు. అసెంబ్లీలో ప్రతిపక్ష నేతను నియమించేటప్పుడు పీడీఏ వర్గాలను విస్మరించిన విధానం ఆందోళన కలిగిస్తోందని తెలిపారు. కేవలం వారిని ఎన్నికల్లో మాత్రమే వాడుకుంటున్నారని ఫైర్ అయ్యారు. ఎస్పీలో ఓ ప్రత్యేక కులానికి తప్ప మరే వర్గానికీ చోటు లేదని ఆరోపించారు. బీఎస్పీ హయాంలోనే వెనుకబడిన వర్గాల అభివృద్ధి జరిగిందని తెలిపారు. కాగా, యూపీ అసెంబ్లీ ప్రతిపక్ష నేతగా మాతా ప్రసాద్ పాండేను ఇటీవల ఎస్పీ నియమించిన విషయం తెలిసిందే.

Tags:    

Similar News