రాహుల్ గాంధీ నివాసం ఎదుట భారీ నిరసనలు

ఢిల్లీలోని రాహుల్ గాంధీ నివాసం ఎదుట సిక్కులు భారీ ఎత్తున నిరసనలు చేపట్టారు.

Update: 2024-09-11 11:17 GMT

దిశ, వెబ్ డెస్క్ : ఢిల్లీలోని రాహుల్ గాంధీ నివాసం ఎదుట సిక్కులు భారీ ఎత్తున నిరసనలు చేపట్టారు. ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్న రాహుల్ గాంధీ.. భారత్ లో సిక్కుల భద్రత గురించి మాట్లాడిన మాటలు తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి. భారత్ లో సిక్కులు తలపాగా, కడియాలు ధరించి భద్రంగానే ఉంటున్నారా అంటూ చేసిన వ్యాఖ్యలను బీజేపీ తప్పు పట్టింది. రాహుల్ అమెరికా వెళ్ళిన ప్రతిసారి భారత్ ను అవమానించేలా మాట్లాడుతున్నారని మండిపడుతోంది. ఇక రాహుల్ చేసిన వ్యాఖ్యలపై పలు సిక్కు సంఘాలు అభ్యంతరం వ్యక్తం చేశాయి. ఢిల్లీలోని రాహుల్ గాంధీ నివాసం ఎదుట సిక్కులు నిరసనలు చేపట్టారు. సిక్కుల మనోభావాలు దెబ్బతినేలా మాట్లాడితే ఊరుకునేది లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వెంటనే రాహుల్ శిక్కులకు క్షమాపణ చెప్పాలని వారు డిమాండ్ చేశారు.


Similar News