కొండ‌చ‌రియ‌లు బీభత్సం.. కుప్పకూలిన ఏడు భవనాలు

హిమాచల్ ప్రదేశ్‌లోని కులు జిల్లా ఆనీ ప‌ట్టణంలో కొండ‌చ‌రియ‌లు విరిగిపడిన ఘటనలో ఏడు బహుళ అంతస్తుల భవనాలు నేల‌మ‌ట్టం అయ్యాయి.

Update: 2023-08-24 10:54 GMT

సిమ్లా : హిమాచల్ ప్రదేశ్‌లోని కులు జిల్లా ఆనీ ప‌ట్టణంలో కొండ‌చ‌రియ‌లు విరిగిపడిన ఘటనలో ఏడు బహుళ అంతస్తుల భవనాలు నేల‌మ‌ట్టం అయ్యాయి. ఎన్డీఆర్ఎప్‌, ఎస్డీఆర్ఎఫ్ ద‌ళాలు హుటాహుటిన రంగంలోకి దిగి ఆ భవనాల శిథిలాల కింద చిక్కుకున్నవారిని బయటికి తీశారు. తీవ్ర గాయాలపాలైన వారిని సమీపంలోని ఆస్పత్రులకు తరలించారు. ‘అధికారులు ముందుజాగ్రత్త చర్యగా రెండు రోజుల క్రితమే ఈ భవనాన్ని ఇటీవలే ఖాళీ చేయించారు.

అందుకే ఈ ప్రమాదంలో ఎవరూ చనిపోలేదు’ అని సీనియర్ పోలీసు అధికారి సంజయ్ కుందు వెల్లడించారు. ఇక ఈ ప్రమాదంపై తీవ్ర విచారం వ్యక్తం చేస్తూ హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి సుఖ్విందర్ సింగ్ సుఖు ట్వీట్ చేశారు. అధికారుల ముందుజాగ్రత్త వల్ల ప్రాణాపాయం తప్పిందని చెప్పారు. దీనికి సంబంధించిన ఒక వీడియోను ఆయన పోస్ట్ చేశారు. కాగా, భారీ వర్షం వల్ల కులు-మండీ హైవేపై దాదాపు రెండు గంటల పాటు ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.


Similar News