Indian Railways: రైల్వే ప్రయాణికులకు షాక్.. నవంబర్ 1 నుంచి కొత్త రూల్

ప్రయాణికులకు ఇండియన్ రైల్వే షాకిచ్చింది.

Update: 2024-10-17 10:25 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: టికెట్ రిజర్వేషన్ల విషయంలో ఇండియన్ రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం ప్రయాణానికి 4 నెలల ముందుగానే ఉన్న బుకింగ్ చేసుకునే సదుపాయాన్ని 2 నెలలకు కుదించింది. నవంబర్ 1వ తేదీ నుంచి ఈ కొత్త విధానం అమలులోకి రానున్నదని రైల్వే వర్గాలు పేర్కొన్నాయి. ఇప్పటికే బుకింగ్ చేసుకున్న వారికి ఎటువంటి ఇబ్బందులు ఉండవని స్పష్టం చేసింది. నిజానికి గతంలో రైల్వే అడ్వాన్స్ బుకింగ్ ప్రయాణానికి 60 రోజుల ముందు అవకాశం ఉండేది. కానీ దాన్ని 160 రోజులకు పెంచగా తాజాగా మళ్లీ పాత పద్ధతిలోకే మార్పు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. కాగా అక్టోబర్ 31 వరకు బుకింగ్ చేసుకునే వారికి పాత నిబంధనలే వర్తించనున్నాయి. తాజ్ ఎక్స్ ప్రెస్, గోమతి ఎక్స్ ప్రెస్ వంటి రైళ్ల బుకింగ్ లో ఎలాంటి మార్పు లేదు. విదేశీ పర్యాటకులు మాత్రం 365 రోజుల ముందుగానే టికెట్ బుకింగ్ చేసుకునే అవకాశంలోనూ ఎలాంటి మార్పులు లేవని ఇండియన్ రైల్వే పేర్కొంది. 


Similar News