Breaking: భారీ అగ్నిప్రమాదం.. క్షణాల్లో చెలరేగిన మంటలు, 16 మందికి గాయాలు (వీడియో)
హిమాచల్ ప్రదేశ్‌లో భారీ అగ్నిప్రమాదం జరిగింది...
దిశ, వెబ్ డెస్క్: హిమాచల్ ప్రదేశ్‌లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. సోలన్ జిల్లా బడ్డీలోని ఓ కెమికల్ కంపెనీలో మంటలు చెలరేగాయి. ఈ సమయంలో కంపెనీలో మొత్తం 41 మంది పని చేస్తున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు, ఎన్టీఆర్ ఎఫ్ సిబ్బంది సహాయ చర్యలు చేపట్టారు. కంపెనీలో అంతకంతకూ మంటలు పెరుగుతున్నాయి. అంతేకాదు కెమికల్ డ్రమ్ములు పేలుతున్నాయి. దీంతో భారీ శబ్ధం వినిపిస్తోంది. కెమికల్ ఫ్యాక్టరీలోని ఓ యూనిట్‌లో చెలరేగిన మంటలు క్షణాల్లో అంతటా విస్తరించారు. నల్లని పొగలు దట్టంగా స్థానిక పరిసరాల్లో అలుముకున్నాయి. దీంతో స్థానికులు సైతం భయాందోళనకు గురయ్యారు.
ప్రస్తుతం కంపెనీలో చేలరేగిన మంటలను ఫైర్, ఎన్టీఆర్ సిబ్బంది అదుపు చేస్తున్నారు. ఈ ఘటనలో 16 మంది గాయాలయినట్లు గుర్తించారు. వీరిని ఛండీగడ్‌లోని స్థానిక ఆస్పత్రులకు తరలించారు. ముందు జాగ్రత్త చర్యలో భాగంగా అగ్నిప్రమాదం జరిగిన ఘటన సమీప ప్రాంతాలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అక్కడ ఉన్న మిగిలిన కంపెనీల ఉద్యోగులను ఖాళీ చేయించారు. ఇంకా మంటలు అదుపులోకి రాకపోవడంతో సహాచర్యలు అందించేందుకు శ్రమిస్తున్నారు.
#WATCH | 41 people including 19 injured people were rescued after a fire broke out in a perfume factory in the Baddi area of Solan district today; Teams of NDRF and Fire Department engaged in the operation to rescue affected persons and douse fire#HimachalPradesh pic.twitter.com/A1l6ypP5HI
— ANI (@ANI) February 2, 2024