Manipur : హింసాకాండ బాధిత మణిపూర్ రైతులకు మరో ప్యాకేజీ
దిశ, నేషనల్ బ్యూరో : మణిపూర్ హింసాకాండలో నష్టపోయిన రైతులకు రెండోదశ పరిహార ప్యాకేజీలను రాష్ట్ర క్యాబినెట్ ఆమోదించింది.
దిశ, నేషనల్ బ్యూరో : మణిపూర్ హింసాకాండలో నష్టపోయిన రైతులకు రెండోదశ పరిహార ప్యాకేజీలను రాష్ట్ర క్యాబినెట్ ఆమోదించింది. మణిపూర్ హోంశాఖ అమలుచేస్తున్న ప్రత్యేక పథకం ద్వారా ఈ సహాయక నిధులను రైతులకు అందజేయనున్నారు. ప్రస్తుత పరిస్థితుల కారణంగా మణిపూర్‌లో పడావుపడిన వ్యవసాయ భూములను నిర్వహించే 2070 మంది రైతులకు రెండోదశ పరిహార ప్యాకేజీ కింద రూ.13.30 కోట్లను అందించనున్నారు.
ఈవిషయాన్ని రాష్ట్ర మంత్రి సపమ్ రంజన్ సింగ్ వెల్లడించారు. ఇక తొలి విడత ప్యాకేజీ కింద 3,483 మంది రైతులకు మార్చి 11న రూ.18.91 కోట్లను పంపిణీ చేశారు. రాష్ట్ర వ్యవసాయ శాఖ అధ్యయనం ప్రకారం హింసాకాండ వల్ల 5,901 మంది రైతులు నష్టపోయారు.