Maharashtra : మాజీ హోం మంత్రి కుమారుడికి టికెట్.. శర‌ద్‌పవార్ కీలక నిర్ణయం

దిశ, నేషనల్ బ్యూరో : మహారాష్ట్ర(Maharashtra) అసెంబ్లీ ఎన్నికల కోసం ఏడుగురు అభ్యర్థులతో శరద్ పవార్ ఎన్‌సీపీ (NCP SP) మరో జాబితాను విడుదల చేసింది.

Update: 2024-10-28 15:44 GMT

దిశ, నేషనల్ బ్యూరో : మహారాష్ట్ర(Maharashtra) అసెంబ్లీ ఎన్నికల కోసం ఏడుగురు అభ్యర్థులతో శరద్ పవార్ ఎన్‌సీపీ (NCP SP) మరో జాబితాను విడుదల చేసింది. ఈ జాబితాలో సలీల్ దేశ్‌ముఖ్ పేరు కూడా ఉంది. ఈయన మహారాష్ట్ర మాజీ హోం మంత్రి అనిల్ దేశ్‌ముఖ్ కుమారుడు. కటోల్ అసెంబ్లీ స్థానం నుంచి సలీల్ దేశ్‌ముఖ్ పోటీ చేయనున్నారు. ఇప్పటివరకు 83 అసెంబ్లీ స్థానాలకు(Assembly Polls) శరద్ పవార్ ఎన్‌సీపీ అభ్యర్థుల పేర్లను ప్రకటించింది.

ఈసందర్భంగా ఎన్‌సీపీ -ఎస్‌పీ చీఫ్ శరద్ పవార్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఏర్పడబోయేది మహా వికాస్ అఘాడీ(ఎంవీఏ) కూటమి ప్రభుత్వమేనని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. మహారాష్ట్ర ప్రజలు మార్పును కోరుకుంటున్నారని చెప్పారు. సరిగ్గా ఎన్నికలకు కొన్ని నెలల ముందే సంక్షేమ పథకాలను ప్రకటించడం ద్వారా బీజేపీ సారథ్యంలోని మహాయుతి కూటమి సర్కారు ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తోందని శరద్ పవార్ తెలిపారు. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ నవంబరు 20న జరగనుండగా, నవంబరు 23న ఓట్ల లెక్కింపు జరుగుతుంది.

Tags:    

Similar News