మహాదేవ్ బెట్టింగ్ యాప్ కేసు: నటుడు సాహిల్ ఖాన్ అరెస్ట్
మహాదేవ్ బెట్టింగ్ యాప్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో ప్రమేయం ఉందన్న ఆరోపణలతో ఛత్తీస్‌గఢ్‌కు చెందిన నటుడు సాహిల్ ఖాన్‌ను ముంబై పోలీసులు అరెస్టు చేశారు.
దిశ, నేషనల్ బ్యూరో: మహాదేవ్ బెట్టింగ్ యాప్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో ప్రమేయం ఉందన్న ఆరోపణలతో ఛత్తీస్‌గఢ్‌కు చెందిన నటుడు సాహిల్ ఖాన్‌ను ముంబై పోలీసులు అరెస్టు చేశారు. సాహిల్ దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్‌ను బాంబే హైకోర్టు తిరస్కరించిన తర్వాత ముంబై పోలీస్ సైబర్ సెల్‌కు చెందిన ప్రత్యేక దర్యాప్తు బృందం జగదల్‌పూర్‌లో సాహిల్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఆయనను అక్కడి నుంచి ముంబై తీసుకొచ్చి కోర్టులో హాజరుపర్చనున్నట్టు తెలుస్తోంది. కొన్ని ఆర్థిక, రియల్ ఎస్టేట్ కంపెనీలు, వివాదాస్పద బెట్టింగ్ యాప్ ప్రమోటర్ల మధ్య జరిగిన అక్రమ లావాదేవీలపై ముంబై సైబర్ సెల్ దర్యాప్తు చేస్తోంది. ఈ కేసులో సాహిల్ ఖాన్‌తో పాటు మరో 31 మందిపై విచారణ జరుగుతోంది. లయన్ బుక్ యాప్‌ను ప్రమోట్ చేసి ఈవెంట్‌లకు హాజరయ్యారని సాహిల్ ఖాన్‌పై ఆరోపణలు వచ్చాయి. ఈ క్రమంలోనే ఆయనను ఇటీవల విచారించిన పోలీసులు తాజాగా అరెస్టు చేశారు. కాగా, ఈ కేసులో దాఖలైన ఎఫ్‌ఐఆర్ ప్రకారం ఈ కుంభకోణం విలువ దాదాపు రూ.15,000 కోట్లు కావడం గమనార్హం.