Madhavrao Scindia : అభ్యంతరకర రీతిలో మాధవ్‌రావ్ సింధియా విగ్రహం తొలగింపు.. అధికారులపై వేటు

దిశ, నేషనల్ బ్యూరో : మధ్యప్రదేశ్‌(Madhya Pradesh)లోని కట్నీ జిల్లాలో 30వ నంబరు జాతీయ రహదారిని నాలుగు లేన్లుగా విస్తరించే పనుల కోసం మాజీ కేంద్ర మంత్రి మాధవ్‌రావ్ సింధియా(Madhavrao Scindia) విగ్రహాన్ని తొలగించారు.

Update: 2024-11-16 18:45 GMT

దిశ, నేషనల్ బ్యూరో : మధ్యప్రదేశ్‌(Madhya Pradesh)లోని కట్నీ జిల్లాలో 30వ నంబరు జాతీయ రహదారిని నాలుగు లేన్లుగా విస్తరించే పనుల కోసం మాజీ కేంద్ర మంత్రి మాధవ్‌రావ్ సింధియా(Madhavrao Scindia) విగ్రహాన్ని తొలగించారు. అయితే ఈ విగ్రహాన్ని అభ్యంతరకర రీతిలో తొలగించారు. శిలాఫలకం దిమ్మె నుంచి మొండెం భాగాన్ని వేరు చేసి నేలపై పడేశారు. అనంతరం దాన్ని ఎర్త్‌మూవింగ్ మెషీన్ సాయంతో మరోచోటుకు తరలించారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయింది.

ఈ విషయాన్ని స్థానిక బీజేపీ ఎంపీ వి.డి.శర్మ నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా(ఎన్‌హెచ్ఏఐ) ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై సీరియస్ అయిన ఉన్నతాధికారులు.. ఆ రహదారి పనులు చేయించిన ఇద్దరు ఎన్‌హెచ్ఏఐ అధికారులను సస్పెండ్ చేశారు. కాంట్రాక్టు సంస్థకు చెందిన ఇద్దరు సిబ్బందిని (సీనియర్ ఇంజినీర్, ఇంజినీర్‌‌) కూడా సస్పెండ్ చేశారు. ఇంకొందరు సిబ్బందికి షోకాజ్ నోటీసులు జారీ చేశారు. ప్రస్తుత కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా తండ్రే మాధవ్‌రావ్ సింధియా. జ్యోతిరాదిత్య సింధియా 2020లో కాంగ్రెస్ నుంచి బీజేపీలోకి చేరారు.

Tags:    

Similar News