Madarsas : మదర్సాలు విద్యాబోధనకు పనికిరావు.. సుప్రీంకోర్టులో ఎన్‌సీపీసీఆర్‌ ప్రమాణపత్రం

దిశ, నేషనల్ బ్యూరో : మదర్సాలలో విద్యాబోధనా ప్రమాణాలపై సుప్రీంకోర్టుకు బాలల హక్కుల పరిరక్షణ కమిషన్‌ (ఎన్‌సీపీసీఆర్‌) ప్రమాణపత్రం సమర్పించింది.

Update: 2024-09-13 17:35 GMT

దిశ, నేషనల్ బ్యూరో : మదర్సాలలో విద్యాబోధనా ప్రమాణాలపై సుప్రీంకోర్టుకు బాలల హక్కుల పరిరక్షణ కమిషన్‌ (ఎన్‌సీపీసీఆర్‌) ప్రమాణపత్రం సమర్పించింది. విద్యాహక్కు చట్టంలోని 19, 21, 22, 24, 29 సెక్షన్లకు విరుద్ధంగా మదర్సాలు పనిచేస్తున్నాయని అందులో ప్రస్తావించింది.

విద్యాహక్కు చట్టం పరిధిలోకి రాకపోవడంతో మదర్సాల విద్యార్థులు మధ్యాహ్న భోజనం, యూనిఫామ్ తదితర హక్కులను కోల్పోతున్నారని ఎన్‌సీపీసీఆర్‌ పేర్కొంది. మదర్సాలలో బోధించే విద్య విద్యార్థులకు అంతగా ఉపయోగపడదని, అవి విద్యాబోధనకు పనికిరావని తెలిపింది. ఎన్‌సీఈఆర్‌టీ పుస్తకాల్లోని కొన్ని అంశాలను మాత్రమే మదర్సాల విద్యార్థులకు బోధిస్తున్నారని ప్రమాణపత్రంలో ఎన్‌సీపీసీఆర్‌ ప్రస్తావించింది.


Similar News