లోక్‌సభ స్పీకర్ ఎన్నిక ప్రక్రియ స్టార్ట్.. ఓం బిర్లా పేరు ప్రతిపాదిస్తూ మోడీ తీర్మానం

దేశ చరిత్రలో తొలిసారి లోక్ సభ స్పీకర్ ఎన్నిక ప్రక్రియ కాసేపటి క్రితం ప్రారంభమైంది.

Update: 2024-06-26 05:46 GMT

దిశ, వెబ్‌డెస్క్: దేశ చరిత్రలో తొలిసారి లోక్ సభ స్పీకర్ ఎన్నిక ప్రక్రియ కాసేపటి క్రితం ప్రారంభమైంది. లోక్ సభ స్పీకర్ గా ఓం బిర్లా పేరు ప్రతిపాదిస్తూ ప్రధాని మోడీ తీర్మానం ప్రవేశపెట్టారు. ప్రధాని మోడీ తీర్మానాన్ని ఇతర మంత్రులు బలపరుస్తున్నారు. తీర్మానాన్ని రాజ్ నాథ్ సింగ్, జితిన్ రామ్ మాంఝీ, శివరాజ్ సింగ్ చౌహాన్ బలపర్చారు. ఎన్డీఏ అభ్యర్థికి వైసీపీ, అన్నాడీఎంకే మద్దతు ప్రకటించాయి. వైసీపీ మద్దతులో ఎన్డీయే బలం 297కు చేరింది. పోటీలో ఉన్న ఇద్దరు అభ్యర్థుల పేర్లతో సభ్యులకు స్లిప్పులు పంపిణీ చేశారు. కాగా, ఎన్డీయే నుంచి ఓంబిర్లా, కూటమి తరఫున సురేష్ బరిలో ఉన్నారు.


Similar News