ఏపీ, తెలంగాణ పోలింగ్‌కు రేపే నోటిఫికేషన్.. టాప్ పాయింట్స్ ఇవే

దిశ, నేషనల్ బ్యూరో : సార్వత్రిక ఎన్నికల నాలుగో దశ పోలింగ్‌కు కేంద్ర ఎన్నికల సంఘం గురువారం నోటిఫికేషన్ విడుదల చేయనుంది.

Update: 2024-04-17 14:21 GMT

దిశ, నేషనల్ బ్యూరో : సార్వత్రిక ఎన్నికల నాలుగో దశ పోలింగ్‌కు కేంద్ర ఎన్నికల సంఘం గురువారం నోటిఫికేషన్ విడుదల చేయనుంది. ఈ విడతలో 10 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల పరిధిలోని 96 లోక్ సభ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ జాబితాలోనే ఆంధ్రప్రదేశ్‌లోని 25 స్థానాలు, తెలంగాణలోని 17 స్థానాలు కూడా ఉన్నాయి. ఉత్తరప్రదేశ్‌లోని 13, మహారాష్ట్రలోని 11, పశ్చిమ బెంగాల్‌లోని 8, మధ్యప్రదేశ్‌లోని 8, బిహార్‌లోని 5, జార్ఖండ్‌లోని 4, ఒడిశాలోని 4, జమ్మూకాశ్మీర్‌లోని 1 స్థానంలో నాలుగో విడత పోలింగ్ జరుగుతుంది. గురువారం నుంచి ఏప్రిల్ 25 వరకు అభ్యర్థుల నుంచి నామినేషన్లు స్వీకరిస్తారు. ఈ 26న నామినేషన్ల పరిశీలన చేపడతారు. 29న నామినేషన్ల ఉప సంహరణతో ఈ ప్రక్రియ ముగుస్తుంది. నాలుగో దశలో భాగంగా ఏపీ, తెలంగాణలలోని స్థానాలకు మే 13న పోలింగ్ జరగనుంది. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలతో పాటు లోక్ సభ స్థానాలకు, తెలంగాణలో లోక్‌సభ ఎన్నికలతో పాటు ఖాళీ అయిన సికింద్రాబాద్ కంటోన్మెంట్ స్థానానికి అదేరోజున ఓటింగ్ జరుగుతుంది. జూన్ 4న ఓట్లు లెక్కించి విజేతలను ప్రకటిస్తారు. కాగా, మొత్తం 7 దశల్లో దేశంలోని 543 లోకసభ స్థానాలకు కేంద్ర ఎన్నికల సంఘం పోలింగ్ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తోంది.

Tags:    

Similar News