వామపక్ష తీవ్రవాదాన్ని రెండేళ్లలో అంతం చేస్తాం : Amit Shah

Update: 2023-10-06 15:19 GMT

న్యూఢిల్లీ : రెండేళ్లలో దేశంలోని వామపక్ష తీవ్రవాదాన్ని (LWE) పూర్తిగా అంతం చేస్తామని కేంద్ర మంత్రి అమిత్ షా తెలిపారు. ఈ ప్రభావిత రాష్ట్రాల్లో భద్రతా పరిస్థితిని సమీక్షించేందుకు శుక్రవారం జరిగిన సమావేశానికి ఆయన అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లో గత నాలుగు దశాబ్దాల నుంచి 2022లోనే అతి తక్కువ హింస, మరణాలు సంభవించాయని చెప్పారు. నక్సలిజం మానవాళికి శాపమని, దానిని అన్ని రకాలుగా నిర్మూలించేందుకు సంకల్పించామని కేంద్ర మంత్రి వెల్లడించారు.

నక్సల్స్ ప్రభావిత రాష్ట్రాల్లో హింసాత్మక ఘటనలు 2010తో పోలిస్తే 2022లో 77 శాతం తగ్గాయని అధికారులు తెలిపారు. గత ఐదేళ్లలో దేశంలోని లెఫ్ట్ వింగ్ తీవ్రవాదానికి సంబంధించి భద్రతా పరిస్థితిలో గణనీయమైన మెరుగుదల ఉందన్నారు. కాగా.. కేంద్ర ప్రభుత్వం ఈ సమస్యను పరిష్కరించేందుకు 2015లో ‘నేషనల్ పాలసీ అండ్ యాక్షన్ ప్లాన్’ను ఆమోదించింది. ఈ విధానాన్ని పకడ్బందీగా అమలు చేయడం వల్ల దేశవ్యాప్తంగా LWE హింస స్థిరంగా తగ్గుముఖం పట్టిందని వారు తెలిపారు.


Similar News