మరోసారి వాయిదా పడ్డ కేఆర్ఎంబీ ఆర్ఎంసీ సమావేశం

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు(కేఆర్ఎంబీ) జలాశయాల పర్యవేక్షక కమిటీ సమావేశం మరోసారి వాయిదా పడింది. బుధవారం తుది సమావేశాన్ని నిర్వహించనుండగా..

Update: 2022-11-24 06:57 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: కృష్ణా నదీ యాజమాన్య బోర్డు(కేఆర్ఎంబీ) జలాశయాల పర్యవేక్షక కమిటీ సమావేశం మరోసారి వాయిదా పడింది. బుధవారం తుది సమావేశాన్ని నిర్వహించనుండగా.. వచ్చే నెల 3వ తేదీన కమిటీ చివరి సమావేశం నిర్వహించాలని నిర్ణయించారు. ఈ మేరకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు సమాచారం అందించారు. అయితే, జల విద్యుత్ ఉత్పత్తి, రూల్ కర్వ్స్, వరద జలాల వినియోగానికి సంబంధించిన విధివిధానాల ఖరారు, నివేదికపై సంతకం కోసం ఆర్ఎంసీ చివరి సమావేశం ఇవాళ జరగాల్సి ఉంది. గతంలో జరిగిన కమిటీ సమావేశాలకు రెండు రాష్ట్రాల అధికారులు హాజరు కాలేదు.

దీంతో, ఈ సమావేశానికి ఎవరు రాకపోయినా, ఏకాభిప్రాయం రాకపోయినా అదే విషయాన్ని బోర్డుకు నివేదిస్తామని తెలిపారు. లక్ష్య సాధనలో ఆర్ఎంసీ వైఫల్యం చెందినట్లు పేర్కొంటామని అన్నారు. ఈ నేపథ్యంలో ఏపీ జెన్‌కో అధికారులు సమావేశానికి హాజరు కాలేమని..తమకు ముందుగానే నిర్ణయించిన సమావేశాలు ఉన్న నేపథ్యంలో సమావేశాన్ని వాయిదా వేయాలని బోర్డును కోరారు. వచ్చే వారం ఆర్ఎంసీ సమావేశం ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. దీంతో ఇవాళ జరగాల్సిన ఆర్ఎంసీ సమావేశాన్ని డిసెంబర్ 3కు వాయిదా వేస్తూ కమిటీ చివరి సమావేశం నిర్వహించాలని బోర్డు నిర్ణయించింది.

Tags:    

Similar News