Kolkata rape-murder: పోస్టుమార్టం రిపోర్టు ఎలా మిస్ అయ్యింది?- సుప్రీంకోర్టు

కోల్ కతా ట్రైనీ డాక్టర్ హత్యాచారం కేసులో పశ్చిమ బెంగాల్ ప్రభుత్వ తీరుపై సుప్రీంకోర్టు మండిపడింది.

Update: 2024-09-09 10:36 GMT

దిశ, నేషనల్ బ్యూరో: కోల్ కతా ట్రైనీ డాక్టర్ హత్యాచారం కేసులో పశ్చిమ బెంగాల్ ప్రభుత్వ తీరుపై సుప్రీంకోర్టు మండిపడింది. ట్రైనీ డాక్టర్ శవపరీక్షకు సంబంధించిన కీలక పత్రం మిస్‌ అయ్యింది. ఈ విషయం తెలుసుకున్న సుప్రీంకోర్టు పశ్చిమ బెంగాల్‌ ప్రభుత్వంపై పైర్ అయ్యింది. కోల్ కతా ట్రైనీ డాక్టర్ హత్యాచారం కేసుపై సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్ ధర్మాసనం విచారణ చేపట్టింది. కాగా.. పోస్టుమార్టం రిపోర్టులు మిస్సింగ్ పై వివరణ ఇవ్వాలని బెంగాల్ ప్రభుత్వాన్న ఆదేశించింది. శవపరీక్ష కోసం బాధితురాలి మృతదేహంతోపాటు ఆమె దుస్తులు కూడా పంపారా? అనే ప్రశ్న ఎదురైంది. దీంతో పోస్ట్‌మార్టం కోసం అవసరమైన కీలక పత్రం గురించి సీజేఐ డీవై చంద్రచూడ్‌ ఆరా తీశారు. పోస్ట్‌మార్టం కోసం మృతదేహంతో పాటు ఏమి పంపారో అనేది సంబంధిత చలాన్‌లోని కాలమ్‌లో కానిస్టేబుల్‌ పూరించాల్సి ఉంటుందని తెలిపారు. ఆ పత్రం లేకుండా శవపరీక్ష నిర్వహించలేరని బెంగాల్ ప్రభుత్వం తరఫు సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్‌ను ఉద్దేశించి అన్నారు.

వివరణ ఇవ్వాలని ఆదేశం

కాగా, ప్రభుత్వం దాఖలు చేసిన నివేదికలో ఈ చలాన్‌ గురించి ఎలాంటి ప్రస్తావన లేదని ధర్మాసనం తెలిపింది. ఒకవేళ అది మిస్‌ అయితే అలా ఎందుకు జరిగిందో అన్నది మంగళవారం లోగా వివరణ ఇవ్వాలని బెంగాల్ ప్రభుత్వ తరఫు న్యాయవాది కపిల్‌ సిబల్‌ ని ఆదేశించారు. ఆ చలాన్‌ను కోర్టుకు సమర్పిస్తామని, అయితే కొంత సమయం కావాలని కోర్టును ఆయన అభ్యర్థించారు. మరోవైపు బాధితురాలు మృతి చెందిన 14 గంటల తర్వాత ఎఫ్ఐఆర్ నమోదు చేసిన సంగతిని ధర్మాసనం గుర్తిచేసింది. ఈ కేసు దర్యాప్తు పురోగతిపై నివేదికను సెప్టెంబర్ 17లోగా సమర్పించాలని సీబీఐకి ధర్మాసనం సూచించింది. అలాగే బాధితురాలి ఫొటోలను సోషల్ మీడియా నుంచి తొలగించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది.


Similar News