Kharge: కశ్మీర్‌కు రాష్ట్ర హోదా కల్పించడమే మొదటి ప్రాధాన్యత.. కాంగ్రెస్ చీఫ్ ఖర్గే

శ్మీర్‌కు రాష్ట్ర హోదాను పునరుద్ధరించడానికే మొదటి ప్రాధాన్యత ఇస్తుందని కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే తెలిపారు.

Update: 2024-09-21 14:47 GMT

దిశ, నేషనల్ బ్యూరో: జమ్మూ కశ్మీర్‌కు రాష్ట్ర హోదాను పునరుద్ధరించడానికే కాంగ్రెస్ మొదటి ప్రాధాన్యత ఇస్తుందని కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే తెలిపారు. శనివారం ఆయన జమ్మూలో విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రాన్ని గతంలో ఎన్నడూ కేంద్ర పాలిత ప్రాంతంగా మార్చలేదన్నారు. కశ్మీర్‌కు రాష్ట్ర హోదా ఎందుకు ఇవ్వలేదని బీజేపీని ప్రశ్నించారు. ‘కాంగ్రెస్త ఏడు హామీలను ప్రకటించింది. కశ్మీర్‌కు రాష్ట్ర హోదా కల్పించడానికే మొదటి ప్రాధాన్యత ఇస్తాం. అలాగే ప్రతి కుటుంబానికి రూ. 25 లక్షల కవరేజీని అందించే ఆరోగ్య బీమా పథకాన్ని అందించడం రెండో హామీ’ అని తెలిపారు. ఇచ్చిన ప్రతిహామీనీ కాంగ్రెస్ నెరవేరుస్తుందని నొక్కి చెప్పారు. జమ్మూ కశ్మీర్‌కు బీజేపీ చేసిందేమీ లేదని విమర్శించారు. 5లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ఇక్కడి యువతను మోసం చేసిందని ఆరోపించారు. ప్రస్తుతం జమ్మూ కశ్మీర్‌లో లక్ష ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని, అధికారంలోకి రాగానే వాటిని భర్తీ చేస్తామని చెప్పారు. 


Similar News