Malayalam cinema: హేమా కమిటీ నివేదికపై కీలక నిర్ణయం తీసుకున్న కేరళ ప్రభుత్వం

హేమా కమిటీ నివేదికపై కేరళ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మలయాల సినీ పరిశ్రమపై వస్తున్న ఆరోపణలు దర్యాప్తు చేసేందుకు పినరయి సర్కారు రెడీ అయ్యింది.

Update: 2024-08-25 15:34 GMT

దిశ, నేషనల్ బ్యూరో: హేమా కమిటీ నివేదికపై కేరళ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మలయాల సినీ పరిశ్రమపై వస్తున్న ఆరోపణలు దర్యాప్తు చేసేందుకు పినరయి సర్కారు రెడీ అయ్యింది. మహిళా ఐఏఎస్ అధికారి నేతృత్వంలో ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) ఏర్పాటు చేయాలని కేరళ సర్కారు నిర్ణయించింది. సిట్‌కు ఇన్‌స్పెక్టర్ జనరల్ స్పర్జన్ కుమార్ నేతృత్వం వహించనున్నారు. సభ్యులుగా ఇతర సీనియర్ మహిళా పోలీసు అధికారులు ఉంటారు. "సినిమా రంగంలో పనిచేస్తున్న కొందరు మహిళలు తాము ఎదుర్కొన్న కష్టాలను వివరిస్తూ ఇంటర్వ్యూలు, ప్రకటనలతో ముందుకొచ్చారు. ఈ వ్యవహారంలో పోలీసు ఉన్నతాధికారులతో సమావేశాన్ని ఏర్పాటు చేశారు " అని సీఎంవో నుంచి ప్రకటన వెలువడింది. ఆ తర్వాతే సిట్ ఏర్పాటు చేస్తున్నట్లు కేరళ సర్కారు వెల్లడించింది.

బాధితుల నుంచి వాంగ్మూలాల సేకరణ

ఇకపోతే, బాధితుల నుండి వాంగ్మూలాలను సేకరించడం, సోషల్ మీడియాలో చేస్తున్న ఆరోపణలను పరిశీలించే విషయాన్ని కూడా పినరయి ప్రభుత్వం సిట్ కే అప్పగించింది. మలయాళ చిత్ర పరిశ్రమలో మహిళలపై వేధింపులు, దోపిడీలు, దుర్వినియోగం సహా ఇతర మానవ హక్కుల ఉల్లంఘనలు జరిగాయని హేమ కమిటీ నివేదిక సమర్పించింది. అయితే, ఈ నివేదిక ఆధారంగా సమగ్ర పోలీసు దర్యాప్తు ప్రారంభఇంచాలని కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ కేరళ సీఎం పినరయి విజయన్ ను డిమాండ్ చేసింది. దీంతో, కేరళ ప్రభుత్వం నుంచి ఈ ప్రకటన వెలువడింది. అంతకుముందు, ప్రముఖ మలయాళ చిత్రనిర్మాత రంజిత్ పై బెంగాలీ నటి శ్రీలేఖ వేధింపుల ఆరోపణలు చేశారు. దీంతో, కేరళ చలనచిత్ర అకాడమీ ఛైర్మన్ పదవికి రంజిత్ రాజీనామా చేశారు.


Similar News