విజింజం పోర్టుకు మొదటి షిప్.. జెండాఊపి సిగ్నల్ ఇచ్చిన కేరళ సీఎం

Update: 2023-10-15 13:23 GMT

తిరువనంతపురం : రూ. 7,700 కోట్ల వ్యయంతో కేరళ రాజధాని తిరువనంతపురం సమీపంలో నిర్మించిన ‘విజింజం’ ఓడరేవుకు మొట్టమొదటి సరుకు రవాణా నౌక ‘జెన్ హువా 15’ చేరుకుంది. చైనాకు చెందిన ఈ కార్గో షిప్‌కు కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ ఆదివారం జెండా ఊపి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. విజింజం పోర్ట్‌కు చేరుకున్న మొదటి విదేశీ కార్గో క్యారియర్ ఇదే.

ఓడరేవును ఈ నౌక తాకగానే.. బాణాసంచా పేల్చి,విజింజం పోర్టుకు మొదటి షిప్.. జెండాఊపి సిగ్నల్ ఇచ్చిన కేరళ సీఎంబెలూన్లను గాల్లో వదిలి ఘన స్వాగతం పలికారు. ఆగస్టు నెలాఖరులో చైనా నుంచి బయలుదేరిన ‘జెన్ హువా 15’ నౌక అక్టోబరు 4నే కేరళ తీరానికి చేరాల్సి ఉండగా, వాతావరణ పరిస్థితులు అనుకూలించక పదిరోజులు ఆలస్యంగా గమ్యస్థానానికి చేరింది. విజింజం పోర్టును ప్రభుత్వ-ప్రైవేట్ భాగస్వామ్యంలో నిర్మించారు.


Similar News