కేరళ ప్రభుత్వం కీలక నిర్ణయం.. కేరళ రాష్ట్రం పేరు మార్పు.. ఏంటో తెలుసా?

కేరళ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

Update: 2023-08-09 10:33 GMT

తిరువనంతపురం : కేరళ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కేరళ పేరును ‘కేరళం’గా మార్చాలని సీఎం పినరయి విజయన్ ప్రవేశపెట్టిన తీర్మానానికి ఆ రాష్ట్ర శాసనసభ ఏకగ్రీవంగా ఆమోదముద్ర వేసింది. రాజ్యాంగంలోని 8వ షెడ్యూల్‌లో పేర్కొన్న అన్ని అధికారిక భాషల్లోనూ కేరళ పేరును కేరళంగా సూచించాలని ఈ తీర్మానంలో ప్రస్తావించారు. ఈ తీర్మానానికి ఆమోద ముద్ర లభించిందని రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ ప్రకటించారు. ఇప్పటికే కేరళను మలయాళంలో కేరళంగా వ్యవహరిస్తున్నారు. ఇతర భాషల్లోనూ అలాగే వ్యవహరించాలని విజయన్ ప్రభుత్వం కేంద్ర సర్కారుకు విజ్ఞప్తి చేసింది.


Similar News