Arvind Kejriwal : పూజారి-గ్రంథి సమ్మాన్ యోజన స్కీమ్ రిజిస్ట్రేషన్ ప్రారంభించిన కేజ్రీవాల్

Update: 2024-12-31 10:54 GMT

దిశ, వెబ్ డెస్క్ : ఢిల్లీ అసెంబ్లీ ఎన్నిక(Delhi Assembly Elections)ల్లో వరుసగా నాలుగోసారి అధికార సాధనే లక్ష్యంగా శ్రమిస్తున్న ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) ఓటర్లను ఆకట్టుకునేందుకు కొత్త జనాకర్షక పథకాలను ప్రకటిస్తున్నారు. తాజాగా పూజారి గ్రంథి సమ్మాన్ యోజన (Pujari Granthi Samman Yojana) పథకాన్ని ప్రకటించిన కేజ్రీవాల్ తన భార్య సునిత(Kejriwal couple)తో కలిసి కశ్మీరి గేట్ వద్ద మార్ఘట్ వాలే బాబా మందిరాన్ని(Visit Margatwale Baba Temple)సందర్శించుకున్నారు. ప్రత్యేక పూజల అనంతరం కేజ్రీవాల్ పూజారి గ్రంథి సమ్మాన్ యోజన పథకం రిజిస్ట్రేషన్‌(Registration)ను (launches) ప్రారంభించారు. పూజారి-గ్రంథి సమ్మాన్ యోజన' స్కీమ్ కింద హనుమాన్ ఆలయ మహంత్ పేరును స్వయంగా కేజ్రీవాల్ రిజిస్టర్ చేశారు. మళ్లీ తాము అధికారంలోకి వస్తే ఆలయాల్లోని పూజారులు, గురుద్వారాలోని గ్రంథిలకు నెలకు రూ.18,000 గౌరవ వేతనం ఇస్తామని ప్రకటించిన ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ మంగళవారంనాడు లాంఛనంగా ఈ స్కీమ్‌కు సంబంధించిన రిజిస్ట్రేషన్ ప్రక్రియను కూడా ప్రారంభించారు. ఈ పథకం కింద ఆలయాల్లో పనిచేసే పూజారులు, గురుద్వారాల్లోని గ్రంథిలకు గౌరవ వేతనంగా నెలకు రూ.18,000 ఇస్తారు. దీనిపై కేజ్రీవాల్ మాట్లాడుతూ, సమాజంలో పూజారులు, గ్రంథీలు కీలక పాత్ర పోషిస్తున్నారని, అయితే తరచు వారు నిర్లక్ష్యానికి గురవుతున్నారని అన్నారు. వారికి సహాయంగా నిలబడేందుకు దేశంలోనే తొలిసారి ఈ పథకాన్ని తాము ప్రవేశపెడుతున్నామని చెప్పారు.

మరోవైపు కేజ్రీవాల్ పూజారి-గ్రంథి సమ్మాన్ యోజన స్కీమ్ ను రాజకీయ స్టంట్‌గా బీజేపీ పేర్కొంది. 17 నెలలుగా బకాయిపడిన వేతనాలు చెల్లించాలంటూ కేజ్రీవాల్ నివాసం వెలుపల ఇమామ్‌లు నిరసనలు తెలుపుతున్నారని, కేజ్రీవాల్ మాత్రం కొత్త స్కీమ్ అంటూ రాజకీయంగా పబ్బం గడుపుకోవాలని చూస్తున్నారని విమర్శించింది. ఢిల్లీ అసెంబ్లీ గడువు 2025 ఫిబ్రవరి 15వ తేదీతో ముగియనుండగా ఎన్నికల పోరుకు అధికార ఆప్, ప్రతిపక్ష బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు సన్నద్ధమవుతున్నాయి.

Tags:    

Similar News