Justin Trudeau: భారత్‌తో కలిసి పనిచేసేందుకు సిద్ధం.. కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో

భారత్‌తో కలిసి పని చేసేందుకు తాము సిద్ధంగా ఉన్నామని కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో స్పష్టం చేశారు. భారతదేశ 78వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల నేపథ్యంలో ఆయన తాజాగా ఓ సందేశాన్ని విడుదల చేశారు.

Update: 2024-08-16 09:58 GMT

దిశ, నేషనల్ బ్యూరో: భారత్‌తో కలిసి పని చేసేందుకు తాము సిద్ధంగా ఉన్నామని కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో స్పష్టం చేశారు. భారతదేశ 78వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల నేపథ్యంలో ఆయన తాజాగా ఓ సందేశాన్ని విడుదల చేశారు. ఇండో-పసిఫిక్ భాగస్వామిగా రెండు దేశాల్లో ప్రజల జీవితాన్ని మెరుగుపర్చేందుకు భారత్‌తో కలిసి పని చేస్తామని చెప్పారు. కెనడాలో భారత సంతతికి చెందిన 1.3 మిలియన్ల మందికి పైగా ప్రజలు నివసిస్తున్నారని, ఇండో-కెనడియన్ కమ్యూనిటీలు కెనడాను అభివృద్ధి చేయడంలో కీలక పాత్ర పోషిస్తాయని సూచించారు. ఈ ప్రజల సహకారంతో కెనడా మరింత బలంగా తయారవుతుందని నొక్కి చెప్పారు. దేశాన్ని బలోపేతం చేయడానికి, శ్రేయస్సును భద్రపరచడానికి భారత్ ఎంతో సహకారం అందిస్తుందని ఆశిస్తున్నట్టు తెలిపారు. కాగా, ఖలిస్థాన్ సానుభూతిపరుడు హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య తర్వాత కెనడా, భారత్‌ల మధ్య దౌత్య సంబంధాలు దెబ్బతిన్న విషయం తెలిసిందే. 

Tags:    

Similar News