చిరుతతో జర్నలిస్ట్ ఫైట్! చివరికి జరిగింది మాత్రం..
ఓ జర్నలిస్టు చిరుతపులితో ఫైట్ చేసిన ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. గ్రామంలో ఓ కథనాన్ని కవర్ చేసేందుకు వెళ్లిన జర్నలిస్ట్ చిరుతపులితో విరోచిత పోరాటం చేసి అదుపులోకి తెచ్చాడు.
దిశ, డైనమిక్ బ్యూరో: ఓ జర్నలిస్టు చిరుతపులితో ఫైట్ చేసిన ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. గ్రామంలో ఓ కథనాన్ని కవర్ చేసేందుకు వెళ్లిన జర్నలిస్ట్ చిరుతపులితో విరోచిత పోరాటం చేసి అదుపులోకి తెచ్చాడు. అనంతరం గ్రామస్థులు చిరుతను తాడుతో బంధించి అటవీశాఖకు అప్పజెప్పారు. రాజస్థాన్‌లోని దుంగార్‌పూర్ భదర్ మెట్వాల గ్రామంలో ఆదివారం చిరుత పులి వచ్చింది. వెంటనే గ్రామస్థులు అటవీశాఖకు సమాచారం అందించారు. అదే సమయంలో స్థానిక జర్నలిస్ట్ గున్వంత్ కలాల్ కవరేజీకి వచ్చారు.
గ్రామస్థులు చిరుతపులిని రాళ్లు రువ్వి బెదరగొట్టే ప్రయత్నం చేయడంతో రెచ్చిపోయిన చిరుత.. జర్నలిస్ట్ కలాల్‌పై దాడి చేసే ప్రయత్నం చేసింది. జర్నలిస్ట్ తనను తాను రక్షించుకోవడానికి చిరుతతో పోరాటం చేశారు. ధైర్యంగా దాని మెడ, దవడను పట్టుకుని దాన్ని అదుపులోకి తెచ్చారు. అక్కడే ఉన్న గ్రామస్తులు వెంటనే చిరుతను తాళ్లతో బంధించారు. అనంతరం అటవీ శాఖకు అప్పజెప్పారు. చిరుతో పోరాడే సమయంలో జర్నలిస్ట్‌కు గాయాలు అయ్యాయి. అయితే జర్నలిస్ట్ ధైర్యసాహసాలను గ్రామస్తులు షాక్ అయ్యారు.