J&K Assembly Elections : జమ్ముకశ్మీర్ ఎన్నికల కోసం ఆప్ తొలి జాబితా

జమ్ముకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల కోసం ఆమ్ ఆద్మీ పార్టీ కసరత్తు ప్రారభించింది. ఇప్పటికే ఏడుగురు అభ్యర్థులతో కూడిన తొలి జాబితాను విడుదల చేసింది.

Update: 2024-08-25 15:20 GMT

దిశ, నేషనల్ బ్యూరో: జమ్ముకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల కోసం ఆమ్ ఆద్మీ పార్టీ కసరత్తు ప్రారభించింది. ఇప్పటికే ఏడుగురు అభ్యర్థులతో కూడిన తొలి జాబితాను విడుదల చేసింది. పుల్వామా నుంచి ఫయాజ్ అహ్మద్, రాజ్ పుర నుంచి మదస్సిర్ హసన్ పేర్లను ఖరారు చేసింది. దేవ్ సర్ నుంచి షేక్‌ ఫిదా హుస్సేన్‌ ను, దురు నుంచి మెహిసిన్ షఫత్కత్ మిర్ ని అభ్యర్థులుగా ప్రకటించింది. దోడా నుంచి యాసిర్‌ షఫి మట్టోని ఎన్నికల బరిలో దించుతున్నట్లు వెల్లడించింది. అసెంబ్లీ ఎన్నికల కోసం స్టార్ క్యాంపెయినర్ల జాబితాను కూడా ఆప్ విడుదల చేసింది. 40 మంది ప్రముఖులు ప్రచారం సాగించనున్నట్లు వెల్లడించింది. ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్, ఆయన భార్య సునితా కేజ్రీవాల్, పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్, ఆప్ మంత్రులు అతిషీ, సంజయ్ సింగ్, గోపాల్ రాయ్, ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా, ఎంపీ రాఘవ్ చడ్డా జమ్ముకశ్మీర్ లో పార్టీ తరఫున ప్రచారం చేయనున్నారు.

మూడు విడతల్లో పోలింగ్

సెప్టెంబర్‌ 18 నుంచి మూడు దశల్లో జమ్ముకశ్మీర్ లో పోలింగ్ జరగనుంది. సెప్టెంబర్ 25న రెండో విడత, అక్టోబర్ 1న తుదివిడత పోలింగ్ జరగనుంది. అక్టోబర్ 4న ఫలితాలు విడుదల కానున్నాయి. కాగా.. మొత్తం 90 నియోజకవర్గాలకు గాను తొలి దశలో 24 స్ధానాలకు, రెండో విడతలో 26 స్థానాలకు, తుదిదశలో 40 స్థానాల్లో పోలింగ్ జరగనుంది.


Similar News