Delhi : గర్భందాల్చిన టీనేజర్.. హత్య చేసిన బాయ్ ఫ్రెండ్

దిశ, నేషనల్ బ్యూరో : ఢిల్లీ(Delhi)లో దారుణం జరిగింది.

Update: 2024-10-25 16:58 GMT

దిశ, నేషనల్ బ్యూరో : ఢిల్లీ(Delhi)లో దారుణం జరిగింది. నగరంలోని నాంగ్లోయి ఏరియాకు చెందిన సోని (19) అనే టీనేజీ అమ్మాయి సంజు అలియాస్ సలీమ్(Boyfriend) అనే యువకుడితో సోషల్ మీడియా వేదికగా ప్రేమలో పడింది. ఆమె వైద్య పరీక్షలు చేయించుకోగా ఏడు నెలల గర్భిణి (Pregnant) అని నిర్ధారణ అయింది. దీంతో తనను వెంటనే పెళ్లి చేసుకోవాలని సంజును సోని చాలా బతిమిలాడింది. అయితే అందుకు సంజు నో చెప్పాడు.

సాధ్యమైనంత త్వరగా అబార్షన్ చేయించుకోమని సోనికి సూచించాడు. అబార్షన్ చేయించుకోనని సోని తేల్చి చెప్పడంతో.. ఆమెను హర్యానాలోని రోహ్‌తక్‌కు తీసుకెళ్లాడు. అక్కడ తన ఇద్దరు స్నేహితులతో కలిసి సోనిని సంజు హత్య చేశాడు. అక్కడే ఓ నిర్మానుష్య ప్రదేశంలో ఆమె డెడ్‌బాడీని పాతిపెట్టాడు. దీనిపై దర్యాప్తు మొదలుపెట్టిన పోలీసులు సంజు, అతడి ఒక స్నేహితుడిని అరెస్టు చేశారు. మరో నిందితుడు పరారీలో ఉన్నాడు.

Tags:    

Similar News