చైనా రాయబారితో జైశంకర్ భేటీ..ద్వైపాక్షిక సంబంధాలపై చర్చ

భారత విదేశాంగ మంత్రి జైశంకర్ చైనా రాయబారి జు ఫీహాంగ్‌తో మంగళవారం ఢిల్లీలో సమావేశమయ్యారు. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలపై చర్చించారు.

Update: 2024-06-25 17:15 GMT

దిశ, నేషనల్ బ్యూరో: భారత విదేశాంగ మంత్రి జైశంకర్ చైనా రాయబారి జు ఫీహాంగ్‌తో మంగళవారం ఢిల్లీలో సమావేశమయ్యారు. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలపై చర్చించారు. వాస్తవ నియంత్రణ రేఖ(ఎల్ఏసీ) వద్ద ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్న నేపథ్యంలో వీరి భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. ఇటీవలే ఫీహాంగ్ భారత్ లో చైనా రాయబారిగా నియమితులయ్యారు. దీంతో వీరిద్దరూ భేటీ కావడం ఇదే మొదటి సారి. సమావేశం అనంతరం జైశంకర్ ఎక్స్ లో పోస్ట్ చేశారు. ఫీహోంగ్‌తో సమావేశంలో ఇరు దేశాల సంబంధాలపై చర్చించినట్టు తెలిపారు. నూతన రాయబారిగా నియమితులైన ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. అలాగే చైనా-భారత్ సంబంధాలను ముందుకు తీసుకెళ్లడానికి కృషి చేస్తామని జు ఫీహాంగ్‌ వెల్లడించారు. అలాగే న్యూజిలాండ్, శ్రీలంక రాయబారులతోనూ జైశంకర్ వేర్వేరుగా సమావేశమయ్యారు. 


Similar News