యూఏఈ కౌంటర్ అబ్దుల్లా బిన్ జాయెద్‌తో జైశంకర్ భేటీ..కీలక అంశాలపై డిస్కషన్

భారత విదేశాంగ మంత్రి జైశంకర్ తన పర్యటనలో భాగంగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(యూఏఈ)కి చేరుకున్నారు

Update: 2024-06-24 05:46 GMT

దిశ, నేషనల్ బ్యూరో: భారత విదేశాంగ మంత్రి జైశంకర్ తన పర్యటనలో భాగంగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(యూఏఈ)కి చేరుకున్నారు. ఈ సందర్భంగా యూఏఈ కౌంటర్ అబ్దుల్లా బిన్ జాయెద్ అల్ నహ్యాన్‌తో అబుదాబిలో భేటీ అయ్యారు. ఇరు దేశాల మధ్య నెలకొన్న వ్యూహాత్మక సంబంధాలతో పాటు ప్రాంతీయ, ప్రపంచ సమస్యలపై చర్చించినట్టు తెలుస్తోంది. గాజాలోని పరిస్థితులపైనా డిస్కస్ చేసినట్టు సమాచారం. ‘అబుదాబిలో యూఏఈ కౌంటర్ ఆల్ నహ్యాన్‌తో భేటీ కావడం సంతోషంగా ఉంది. భారత్, యూఏఈల మధ్య పెరుగుతున్న సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యంపై లోతైన సంభాషణలు. ఇతర విషయాలపై చర్చించాం’ అని జైశంకర్ ఎక్స్‌లో పోస్ట్ చేశారు.

అల్ నహ్యాన్‌తో సమావేశానికి ముందు జైశంకర్ అబుదాబిలో ఈ ఏడాది ఫిబ్రవరి 14న ప్రధాని మోడీ ప్రారంభించిన ఐకానిక్ బీఏపీఎస్ హిందూ మందిర్‌ను సందర్శించారు. భారత్-యూఏఈల స్నేహానికి ఇది చిహ్నం లాంటిదని కొనియాడారు. అనంతరం అబుదాబిలోని లౌవ్రే మ్యూజియం ప్రాంగణంలో యూఏఈలోని భారత రాయబార కార్యాలయం నిర్వహించిన 10వ అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకల్లో జైశంకర్ పాల్గొన్నారు. కాగా, గత కొన్ని సంవత్సరాలుగా భారత్-యూఏఈల మధ్య సంబంధాలు మెరుగయ్యాయి. 2015 ఆగస్టులో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ యూఏఈ పర్యటన తర్వాత రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు మరింత బలోపేత మయ్యాయి. ఈ క్రమంలోనే 2022 ఫిబ్రవరిలో సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం పై ఇరు దేశాలు సంతకం చేశాయి. 


Similar News