Jai shanker: బంగ్లాదేశ్‌లోని భారతీయులతో టచ్‌లో ఉన్నాం.. విదేశాంగ మంత్రి జైశంకర్

బంగ్లాదేశ్‌లోని తాజా పరిస్థితులపై విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ మంగళవారం రాజ్యసభలో వివరించారు. బంగ్లాదేశ్ తీవ్ర రాజకీయ సంక్షోభం ఎదుర్కొంటుందని తెలిపారు.

Update: 2024-08-06 10:30 GMT

దిశ, నేషనల్ బ్యూరో: బంగ్లాదేశ్‌లోని తాజా పరిస్థితులపై విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ మంగళవారం రాజ్యసభలో వివరించారు. బంగ్లాదేశ్ తీవ్ర రాజకీయ సంక్షోభం ఎదుర్కొంటుందని, అక్కడి పరిస్థితులను నిరంతరం గమనిస్తున్నామని తెలిపారు. భారతీయులతోనూ నిరంతరం టచ్‌లో ఉన్నామని చెప్పారు. బంగ్లాదేశ్‌లో మొత్తం 19,000 మంది ఇండియన్స్ ఉండగా..అందులో 9,000 మంది విద్యార్థులు ఉన్నట్టు వెల్లడించారు. అనేక మంది స్టూడెంట్స్ ఇప్పటికే గత నెలలో భారత్‌కు వచ్చారని తెలిపారు. ఢాకాలోని హై కమిషనర్‌తో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతున్నామని చెప్పారు. మాజీ ప్రధాని షేక్‌ హసీనా భారత్‌కు రావాలని కోరుకుంటున్నట్టు తెలియజేశారు. దీంతో కేంద్ర ప్రభుత్వ అనుమతితో దేశానికి రావడానికి ఏర్పాట్లు చేసినట్టు స్పష్టం చేశారు.

హిందువులపై దాడి ఆందోళనకరం

బంగ్లాదేశ్‌లో హిందువులను టార్గెట్ చేశారని ఇది ఎంతో ఆందోళనకరమైన విషయమని చెప్పారు. మైనారిటీలకు సంబంధించిన పరిస్థితులను పర్యవేక్షిస్తున్నామని, వారి రక్షణ కోసం చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. కానీ శాంతిభద్రతలు క్షీణించినంత సేపు ఆందోళన ఉంటుందని తెలిపారు. చొరబాటు ఆందోళనల కారణంగా మేఘాలయలో 12 గంటల రాత్రి కర్ఫ్యూ, అలాగే సరిహద్దు భద్రతా దళాలను హై అలర్ట్‌లో ఉంచామని గుర్తు చేశారు.

Tags:    

Similar News