Israel: బందీల మరణంపై ఆగ్రహం.. ఇజ్రాయెల్‌లో భారీ నిరసనలు

గాజాలోని రఫా నగరంలో ఆరుగురు బందీల మృత దేహాలను స్వాధీనం చేసుకుకోవడంతో ఇజ్రాయెల్‌లో ఆగ్రహం పెల్లుబికింది.

Update: 2024-09-02 08:29 GMT

దిశ, నేషనల్ బ్యూరో: గాజాలోని రఫా నగరంలో ఆరుగురు బందీల మృత దేహాలను స్వాధీనం చేసుకుకోవడంతో ఇజ్రాయెల్‌లో ఆగ్రహం పెల్లుబికింది. ప్రజలు భారీగా వీధుల్లోకి వచ్చి ప్రధాని నెతన్యాహుకు వ్యతిరేకంగా నిరసన తెలిపారు. రాజధాని టెల్ అవీవ్‌లో సుమారు 5 లక్షల మందికి పైగా గుమిగూడి ఆందోళ చేపట్టారు. బందీల విడుదలకు ప్రధాని నెతన్యాహు, ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోలేదని ఫైర్ అయ్యారు. రాజకీయ కారణాలతోనే యుద్ధాన్ని ఆపేందుకు ఒప్పందం కుదుర్చుకోవడం లేదని ఆరోపించారు. వీలైనంత త్వరగా హమాస్‌తో కాల్పుల విరమణ చేసుకోవాలని డిమాండ్ చేశారు. మిగిలిన 101 మంది బందీలను స్వదేశానికి తీసుకురావడానికి చర్యలు తీసుకోవాలని కోరారు. టెలిఅవీవ్ గాక ఇతర నగరాల్లోనూ ప్రజలు నిరసన చేపట్టారు. గతేడాది అక్టోబర్ 7 దాడుల తర్వాత ఇజ్రాయెల్‌లో అతిపెద్ద ప్రదర్శన ఇదే కావడం గమనార్హం.

టెల్ అవీవ్‌ విమానాశ్రయం మూసివేత !

ఇజ్రాయెల్‌లో అతిపెద్ద ట్రేడ్ యూనియన్ జనరల్ ఫెడరేషన్ ఆఫ్ లేబర్ సైతం బందీల మరణాలకు నిరసనగా సోమవారం నుంచి దేశవ్యాప్త సమ్మెకు పిలుపునిచ్చింది. బ్యాంకింగ్, ఆరోగ్య సంరక్షణ, దేశంలోని ప్రధాన విమానాశ్రయంతో సహా ఆర్థిక వ్యవస్థలోని ప్రధాన రంగాలకు అంతరాయం కలిగించడం దీని లక్ష్యం. దీంతో టెల్ అవీవ్‌లోని బెన్ గురియన్ అంతర్జాతీయ విమానాశ్రయంలో రెండు గంటలపాటు కార్యకలాపాలను నిలిపివేసినట్టు తెలుస్తోంది. గాజాలో హమాస్ చెర నుంచి ప్రజలను తిరిగి తీసుకురావడానికి ప్రభుత్వంపై ఒత్తిడి పెంచడమే సమ్మె ఉద్దేశమని కార్మిక సంఘం తెలిపింది.

మరోవైపు 6, 40,000 మంది పిల్లలకు ఆదివారం నుంచి పోలియో టీకాలు వేయడం ప్రారంభించారు. ఈ కార్యక్రమం నేపథ్యంలో ప్రతిరోజూ ఎనిమిది గంటల పాటు గాజా ప్రాంతాలలో దాడులు ఆపివేయడానికి ఇజ్రాయెల్ అంగీకరించింది. పాలస్తీనా అధికారుల ప్రకారం.. కుటుంబ సభ్యులతో కలిసి పిల్లలు, సెంట్రల్ గాజా నగరం డీర్ అల్-బలాలో ఐక్యరాజ్యసమితి ఏర్పాటు చేసిన క్లినిక్ వద్ద టీకాలు వేయించడానికి సిద్ధంగా ఉన్నారు. మొదటి రోజు సుమారు 72,611 మంది పిల్లలకు టీకాలు వేసినట్టు ఆరోగ్యాధికారులు తెలిపారు. 


Similar News