Israel: డిఫెన్స్ మినిస్టర్‌ను తొలగించిన నెతన్యాహు

ఇజ్రాయిల్ ప్రైమ్ మినిస్టర్ నెతన్యాహు రక్షణ శాఖ మంత్రి యోవ్ గలాంట్‌ను విధుల నుంచి తప్పించారు. ఆ స్థానంలో కట్జ్ ను కొత్త డిఫెన్స్ మినిస్టర్‌గా ప్రకటించారు. విదేశాంగ శాఖ మంత్రిగా జిడియాన్ సార్‌ను నెతన్యాహు నియమించారు.

Update: 2024-11-05 19:53 GMT

దిశ, నేషనల్ బ్యూరో : ఇజ్రాయిల్ ప్రైమ్ మినిస్టర్ నెతన్యాహు రక్షణ శాఖ మంత్రి యోవ్ గలాంట్‌ను విధుల నుంచి తప్పించారు. ఆ స్థానంలో కట్జ్ ను కొత్త డిఫెన్స్ మినిస్టర్‌గా ప్రకటించారు. విదేశాంగ శాఖ మంత్రిగా జిడియాన్ సార్‌ను నెతన్యాహు నియమించారు. ఈ సందర్భంగా నెతన్యాహు మాట్లాడుతూ.. ఇజ్రాయిల్ యుద్ధంలో తనకు గలాంట్‌కు మధ్య అనేక విషయాల్లో బేధాభిప్రాయాలు ఉన్నట్లు స్పష్టం చేశారు. యుద్ధం నిర్వహణలో ఇది అనేక అంశాల్లో తమకు ఇబ్బందిగా మారిందన్నారు. ఉద్వాసనకు గురైన గలాంట్ మిత్రదేశాలతో సత్సంబంధాలు కలిగి ఉన్నారు. గలాంట్ ను మార్చిలోనే తొలగించాలని నెతన్యాహు భావించగా స్థానికుల నుంచి తీవ్ర నిరసనలు వ్యక్తం అయ్యాయి. అయితే తాజాగా మంగళవారం అర్థరాత్రి ప్రధాని తన నిర్ణయాన్ని అనౌన్స్ చేశారు. యుద్ధం సమయంలో ప్రధాని, రక్షణ మంత్రి మధ్య సత్సంబంధాలు అవసరం అని నెతన్యాహు కార్యాలయం

ఈ సందర్భంగా స్పష్టం చేసింది. అయితే గతంలో ప్రధాని, డిఫెన్స్ మినిస్టర్‌ల మధ్య మంచి బంధమే ఉన్నప్పటికీ అది క్రమంగా సన్నగిల్లిందని తెలిపింది. యుద్ధానికి ముందు నుంచి రక్షణమంత్రితో ప్రధాని విభేదిస్తున్నారని.. అయితే గలాంట్ న్యాయ సంస్కరణలను వ్యతిరేకిస్తూ వస్తున్నారని పేర్కొంది.

Tags:    

Similar News