‘అమృత్‌కాల్’ అంటే ఇదేనా?: రైతులపై టియర్ గ్యాస్ ప్రయోగించడంపై మమతా బెనర్జీ

తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఢిల్లీలో మార్చ్ నిర్వహిస్తున్న రైతులపై టియర్ గ్యాస్ ప్రయోగించడంపై పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఆగ్రహం వ్యక్తం చేశారు.

Update: 2024-02-13 10:07 GMT

దిశ, నేషనల్ బ్యూరో: తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఢిల్లీలో మార్చ్ నిర్వహిస్తున్న రైతులపై టియర్ గ్యాస్ ప్రయోగించడంపై పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఆగ్రహం వ్యక్తం చేశారు. అమృత్ కాల్ అంటే ఇదేనా అని కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. బీజేనీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం రైతులను ఆదుకోవడంలో పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. ఇలా అయితే వికసిత్ భారత్ ఎలా సాధ్యమవుతుందని నిలదీశారు. రైతులను అణచివేసే బదులు, వారి డిమాండ్లను నెరవేర్చేందుకు ప్రయత్నిస్తే బాగుంటుందని తెలిపారు.రైతులకు ప్రతి ఒక్కరూ సంఘీభావం తెలపాలని పిలుపునిచ్చారు. మరోవైపు సమాజ్ వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్ కూడా రైతులపై బాష్పవాయువు ప్రయోగించడాన్ని ఖండించారు. ‘రైతుల కవాతును నియంత్రించడానికి టియర్ గ్యాస్ ఉపయోగించడం, సరిహద్దుల్లో బ్యారీకేడ్లు ఏర్పాటు చేయడం వంటివి చేస్తు్న్నారు. రైతుల గొంతులను కేంద్ర అణచివేస్తోంది. రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామని, పంట రేటు, ఎంఎస్‌పీ అమలు చేస్తామని వాగ్దానం చేసిన ప్రభుత్వంమే ఇలాంటి చర్యలకు పాల్పడటం ఆశ్యర్యం కలిగిస్తోంది’ అని వ్యాఖ్యానించారు. 

Tags:    

Similar News