ఆ విషయంలో నాకు వెలితిగా అనిపిస్తోంది.. ప్రధాని ఆసక్తికర వ్యాఖ్యలు
పార్లమెంట్ ఎన్నికల ఫలితాల వేళ ప్రధాని నరేంద్ర మోడీ కీలక వ్యాఖ్యలు చేశారు. 2014 నుంచి దేశంలో బలమైన ప్రతిపక్షం లేదని అన్నారు. బలమైన ప్రతిపక్షం ఉండాలనే తాను కోరుకున్నట్లు తెలిపారు.
దిశ, వెబ్‌డెస్క్: పార్లమెంట్ ఎన్నికల ఫలితాల వేళ ప్రధాని నరేంద్ర మోడీ కీలక వ్యాఖ్యలు చేశారు. 2014 నుంచి దేశంలో బలమైన ప్రతిపక్షం లేదని అన్నారు. బలమైన ప్రతిపక్షం ఉండాలనే తాను కోరుకున్నట్లు తెలిపారు. కానీ అది లోపించడం తనకు బాధ కలిగిస్తోందని అన్నారు. తన జీవితంలో ఏదైనా వెలితి ఉందంటే అది ప్రతిపక్షం విషయంలోనే అని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఉన్న ప్రతిపక్షం ఏనాడూ ఉపయోగపడలేదని అన్నారు. దేశ ప్రయోజనాల కోసం తీసుకున్న నిర్ణయాలను ప్రతిపక్షం రాజకీయ లబ్ధి కోసం వ్యతిరేకిస్తోందని అసహనం వ్యక్తం చేశారు. దేశంలో బలమైన ప్రతిపక్షం ఉండాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. అది ప్రజలకు, ప్రభుత్వానికి ఉపయోగపడేలా ఉండాలని ఆకాంక్షించారు. అంతకుముందు తాను ఇంకో రెండు దశాబ్దాల పాటు రాజకీయాల్లోనే ఉంటానని స్పష్టం చేశారు. దేవుడు తనను ప్రత్యేక కార్యం మీద పంపారని.. తనకు వందేళ్లు వచ్చే వరకు రాజకీయాల్లో క్రియాశీలకంగా ఉంటానని ఆయన చేసిన వ్యాఖ్యలు దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారాయి.