ఇండోర్‌కు బెస్ట్ ‘నేషనల్ స్మార్ట్ సిటీ’ అవార్డ్..

మధ్యప్రదేశ్‌లోని ఇండోర్.. ‘బెస్ట్ నేషనల్ స్మార్ట్ సిటీ అవార్డ్’ పొందింది. నాలుగో ఎడిషన్‌ పోటీలో 100 స్మార్ట్ సిటీస్‌ నుంచి ఉత్తమ పనితీరుతో ఇండోర్ ఈ అవార్డ్‌ సొంతం చేసుకుంది.

Update: 2023-08-25 16:55 GMT

న్యూఢిల్లీ: మధ్యప్రదేశ్‌లోని ఇండోర్.. ‘బెస్ట్ నేషనల్ స్మార్ట్ సిటీ అవార్డ్’ పొందింది. నాలుగో ఎడిషన్‌ పోటీలో 100 స్మార్ట్ సిటీస్‌ నుంచి ఉత్తమ పనితీరుతో ఇండోర్ ఈ అవార్డ్‌ సొంతం చేసుకుంది. సూరత్, ఆగ్రా వరుసగా రెండు, మూడో స్థానాల్లో నిలిచాయి. 2022 సంవత్సరానికి గాను ఇండియా స్మార్ట్ సిటీస్ అవార్డ్ కాంటెస్ట్ (ISAC) నాలుగో ఎడిషన్ ఫలితాలను శుక్రవారం ప్రకటించారు.

ఇక కొవిడ్ కారణంగా 2021 ఫలితాలను గతేడాది ప్రకటించలేదు. కాగా.. ISAC 2022 అవార్డ్స్‌ను సెప్టెంబర్ 27న ఇండోర్‌లో భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము విజేతలకు అందజేయనున్నారు. రాష్ట్రాల విషయానికొస్తే.. మధ్యప్రదేశ్, తమిళనాడు ఉత్తమ పనితీరుతో మొదటి రెండు స్థానాలు పొందాయి. రాజస్థాన్, ఉత్తర ప్రదేశ్ సంయుక్తంగా మూడో స్థానంలో నిలిచాయి.


Similar News