కెనడాలో భారత సంతతి బిల్డర్ కాల్చివేత
కెనడాలోని దక్షిణ ఎడ్మాంటన్‌లో జరిగిన కాల్పుల్లో భారత సంతతికి చెందిన గిల్ బిల్ట్ హోమ్స్ యజమాని బూటా సింగ్ గిల్(49) మరణించారు. ఈ ఘటనలో బూటా సింగ్ సహా మరో వ్యక్తి సైతం మృతి చెందినట్టు
దిశ, నేషనల్ బ్యూరో: కెనడాలోని దక్షిణ ఎడ్మాంటన్‌లో జరిగిన కాల్పుల్లో భారత సంతతికి చెందిన గిల్ బిల్ట్ హోమ్స్ యజమాని బూటా సింగ్ గిల్(49) మరణించారు. సోమవారం మధ్యాహ్నం జరిగిన ఈ ఘటనలో బూటా సింగ్ సహా మరో వ్యక్తి సైతం మృతి చెందినట్టు ఎడ్మాంటన్ పోలీసులు తెలిపారు. కావానాగ్ లోని చెర్నియాక్ వే సౌత్‌వెస్ట్ ప్రాంతంలో కాల్పులు జరిగినట్టు వెల్లడించారు. ఈ ఘటనలో బూటాసింగ్, మరో వ్యక్తి(57) మరణించగా..51ఏళ్ల వయసున్న మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అయితే కాల్పులు ఎవరు జరిపారు? హత్య చేయడానికి గల కారణాలేంటి? అనే వివరాలు వెల్లడించలేదు. బూటా సింగ్‌కు స్థానిక ప్రజలతో మంచి సన్నిహిత సంబంధాలు ఉండేవని తెలుస్తోంది. ప్రజలకు ఏ అవసరం వచ్చినా సహాయం చేసేవాడని ఎడ్మాంటాన్ మాజీ కౌన్సిలర్ మొహిందర్ బంగా తెలిపారు. గిల్‌కు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నట్టు సమాచారం.