Indian Army : కశ్మీర్‌లో ‘విలేజ్ డిఫెన్స్ గార్డ్స్.. ఉగ్రవాదంపై పోరుకు యువత రెడీ

దిశ, నేషనల్ బ్యూరో : జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదంపై పోరులో స్థానిక యువతను భాగస్వాములుగా చేసే దిశగా భారత ఆర్మీ వడివడిగా అడుగులు వేస్తోంది.

Update: 2024-09-06 14:53 GMT

దిశ, నేషనల్ బ్యూరో : జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదంపై పోరులో స్థానిక యువతను భాగస్వాములుగా చేసే దిశగా భారత ఆర్మీ వడివడిగా అడుగులు వేస్తోంది. ఈక్రమంలోనే గ్రామస్థాయిలో విలేజ్ డిఫెన్స్ గార్డ్స్ (వీడీజీ) పేరుతో స్థానిక యువతతో ప్రత్యేక దళాలను రెడీ చేస్తోంది. వీడీజీలో చేరే యువతకు ఆటోమేటిక్ తుపాకులు ఫైర్ చేయడం, స్క్వాడ్ పోస్ట్ డ్రిల్స్ చేయడం, గెరిల్లా పోరాటాలకు సంబంధించిన నైపుణ్యాలపై ప్రాథమిక స్థాయి శిక్షణను ఆర్మీ అందిస్తోంది.

ప్రస్తుతం జరుగుతున్న మూడు రోజుల వీడీజీ ట్రైనింగ్ సెషన్‌లో దాదాపు 600 మంది యువత పాల్గొంటున్నారు. కశ్మీర్‌లోని సరోలాలో ఉన్న కార్ప్స్ బ్యాటిల్ స్కూల్ నిపుణులు వీరికి ట్రైనింగ్ అందిస్తున్నారు. ఇప్పటికే రాజౌరీ ఏరియాలో దాదాపు 500 మంది యువత ట్రైనింగ్‌ను పూర్తి చేసుకొని వీడీజీలుగా సేవలు అందిస్తున్నారు. దోడా, కిష్త్‌వార్ ఏరియాల్లో మరో 90 మంది శిక్షణ పూర్తి చేసుకున్నారు.


Similar News