Religious Freedom : భారత్‌లో మత స్వేచ్ఛపై అమెరికా సంస్థ నివేదిక.. ఘాటుగా భారత్ రియాక్షన్

దిశ, నేషనల్ బ్యూరో : అమెరికా ప్రభుత్వానికి చెందిన ‘‘అంతర్జాతీయ మత స్వేచ్ఛపై యూఎస్‌ కమిషన్‌’’(యూఎస్‌‌ సీఐఆర్‌ఎఫ్) సంచలన నివేదికను విడుదల చేసింది.

Update: 2024-10-03 14:46 GMT

దిశ, నేషనల్ బ్యూరో : అమెరికా ప్రభుత్వానికి చెందిన ‘‘అంతర్జాతీయ మత స్వేచ్ఛపై యూఎస్‌ కమిషన్‌’’(యూఎస్‌‌ సీఐఆర్‌ఎఫ్) సంచలన నివేదికను విడుదల చేసింది. భారత్‌లో మతస్వేచ్ఛపై దాడి జరుగుతోందని ఆ నివేదికలో పేర్కొంది. దీన్ని భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణధీర్‌ జైస్వాల్ ఖండించారు. యూఎస్‌‌సీఐఆర్‌ఎఫ్ అనేది రాజకీయ ఎజెండాతో కూడిన పక్షపాత సంస్థ అని ఆయన విమర్శించారు. భారత్‌పై ఆ సంస్థ తప్పుడు ప్రచారానికి తెగబడిందని మండిపడ్డారు. అవాస్తవాలు, ప్రేరేపిత కథనాలతో కూడిన నివేదికలను అది వ్యాపింప జేస్తోందన్నారు.

తాజాగా యూఎస్‌‌సీఐఆర్‌ఎఫ్ విడుదల చేసిన నివేదికను భారత్ తిరస్కరిస్తోందని రణధీర్‌ జైస్వాల్ పేర్కొన్నారు. ఇలాంటి తప్పుడు నివేదికలను రూపొందించడం ద్వారా ఆ సంస్థ విలువ మరింత పతనమైందని ధ్వజమెత్తారు. ఇకనైనా ఇలాంటి అవాస్తవ నివేదికల రూపకల్పనకు దూరంగా ఉండాలని యూఎస్‌‌సీఐఆర్‌ఎఫ్‌కు ఆయన హితవు పలికారు. అమెరికా ఎదుర్కొంటున్న మానవ హక్కుల సమస్యలను పరిష్కరించడంపై దృష్టిసారిస్తే బాగుంటుందని రణధీర్‌ జైస్వాల్ సూచించారు. 


Similar News