కీలక నిర్ణయాలకు కేంద్ర కేబినెట్ ఆమోదం
కేంద్రంలోని ఎన్డీఏ సర్కార్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ప్రధాని నరేంద్ర మోడీ(Prime Minister Narendra Modi) అధ్యక్షతన గురువారం మంత్రిమండలి(Central Cabinet) సమావేశం జరిగింది.
దిశ, వెబ్‌డెస్క్: కేంద్రంలోని ఎన్డీఏ సర్కార్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ప్రధాని నరేంద్ర మోడీ(Prime Minister Narendra Modi) అధ్యక్షతన గురువారం మంత్రిమండలి(Central Cabinet) సమావేశం జరిగింది. ఈ సందర్భంగా పలు కీలక నిర్ణయాలకు కేబినెట్‌లో ఆమోదం లభించింది. పీఎం వికాస్ యోజన, కృషోన్నతి యోజనకు రూ.1,01,321 కోట్లు. రైతుల ఆదాయం పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో అక్కడి పంటలకు అనుగుణంగా నిర్ణయాలు. ఫుడ్ సెక్యూరిటీతో రైతుల ఆదాయం పెంచేందుకు ప్రత్యేక కార్యాచరణ. చెన్నై మెట్రో ఫేస్-2కు ఆమోదం. రూ.63,246 కోట్లతో చెన్నై మెట్రో ఫేస్-2. 119 కిలోమీటర్లు, 3 కారిడార్లలో 120 మెట్రోస్టేషన్లు. ఫోర్ట్ ఉద్యోగుల కోసం ప్రొడక్టివిటీ లింక్ రివార్డ్. 20,704 మంది ఉద్యోగులకు లబ్ధి. రైల్వే ఉద్యోగుల కోసం ప్రొడక్టివిటీ లింక్డ్ బోనస్ వంటి వాటికి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది.