ఆ రెండింటిని ఓడించిన భారత్‌.. ప్రతిష్ఠాత్మక అంతర్జాతీయ అవార్డు

దిశ, నేషనల్ బ్యూరో : మీజిల్స్, రుబెల్లా వ్యాధులపై భారత్ అలుపెరుగని పోరాటం చేస్తోంది.

Update: 2024-03-08 15:43 GMT

దిశ, నేషనల్ బ్యూరో : మీజిల్స్, రుబెల్లా వ్యాధులపై భారత్ అలుపెరుగని పోరాటం చేస్తోంది. ఇందుకుగానూ ప్రతిష్ఠాత్మక ‘మీజిల్స్ అండ్ రుబెల్లా ఛాంపియన్’ అవార్డును భారత్ గెల్చుకుంది. ఈవిషయాన్ని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. మార్చి 6న అమెరికాలోని వాషింగ్టన్‌‌లో ఉన్న అమెరికన్ రెడ్‌క్రాస్ హెడ్‌క్వార్టర్స్‌లో ‘మీజిల్స్ అండ్ రుబెల్లా పార్టనర్‌షిప్’ సంస్థ నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో ఈ అవార్డును కేంద్ర ఆరోగ్యశాఖ తరఫున భారత రాయబారి శ్రీప్రియా రంగనాథన్ అందుకున్నారు. ‘మీజిల్స్ అండ్ రుబెల్లా పార్టనర్‌షిప్’ సంస్థలో అమెరికన్ రెడ్‌క్రాస్, బిల్ మిలిండాగేట్స్ ఫౌండేషన్, ప్రపంచ ఆరోగ్య సంస్థ, యూనిసెఫ్‌లు భాగస్వాములుగా ఉన్నాయి. మీజిల్స్ అండ్ రుబెల్లా వ్యాక్సిన్ 2017 సంవత్సరం నుంచి భారతదేశపు యూనివర్సల్ ఇమ్యునైజేషన్ ప్రోగ్రాం (యూఐపీ)లో భాగంగా ఉంది. ఈ ప్రయత్నాల ఫలితంగా మనదేశంలోని 50 జిల్లాల్లో గత ఏడాది వ్యవధిలో ఒక్క మీజిల్స్ కేసు కూడా బయటపడలేదు. ఇక 226 జిల్లాల్లో గత 12 నెలల్లో రుబెల్లా కేసులు అస్సలు నమోదు కాలేదు.

Tags:    

Similar News