CM కేజ్రీవాల్ అరెస్ట్‌ను ఖండిస్తూ.. ఇండియా కూటమి కీలక నిర్ణయం
ఢిల్లీ లిక్కర్ కుంభకోణం కేసులో అరెస్ట్ అయి ఈడీ కస్టడీలో ఉన్న ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు ఇండియా కూటమి పార్టీలు మద్దతు ప్రకటించారు.
దిశ, వెబ్‌డెస్క్: ఢిల్లీ లిక్కర్ కుంభకోణం కేసులో అరెస్ట్ అయి ఈడీ కస్టడీలో ఉన్న ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు ఇండియా కూటమి పార్టీలు మద్దతు ప్రకటించారు. ఎన్నికల వేళ కేజ్రీవాల్ అరెస్ట్ అప్రజాస్వామికం అని ఖండిస్తూ శుక్రవారం ప్రకటన విడుదల చేశాయి. అంతేకాదు.. అరెస్ట్‌ను వ్యతిరేకిస్తూ కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయడానికి ఇండియా కూటమి సిద్ధమైంది. అయితే, లిక్కర్ స్కామ్ కేసులో సీఎం కేజ్రీవాల్‌ను గురువారం ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. సెర్చ్ వారెంట్ ఆయన ఇంటికి వచ్చిన అధికారులు రెండు గంటల పాటు సుదీర్ఘంగా సోదాలు జరిపి.. కేజ్రీవాల్ ఫోన్‌తో పాటు పలు కీలక డాక్యూమెంట్లు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం ఆయన్ను అదుపులోకి తీసుకొని ఈడీ కార్యాలయానికి తరలించారు. తరలించే క్రమంలో ఆప్(AAP) కార్యకర్తలు అడ్డుకోబోగా.. పోలీసులు వారిని చెదరగొట్టారు.