ఇది కదా హోరాహోరీ పోరు అంటే.. 32 ఓట్లతో విజయం

ఈ రోజు వెలువడిన రెండు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు వెలుబడ్డాయి. ఇందులో కొన్ని స్థానాల్లో అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి.

Update: 2024-10-08 13:28 GMT

దిశ, వెబ్ డెస్క్: ఈ రోజు వెలువడిన రెండు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు వెలుబడ్డాయి. ఇందులో కొన్ని స్థానాల్లో అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి. అయితే మరికొన్ని చోట్ల మాత్రం ప్రత్యర్థుల మధ్య నువ్వా నేనా అన్నట్లుగా హోరాహోరి కొనసాగింది. మొదట జమ్ములో హోరాహోరి పోరు తర్వాత బీజేపీ యువ మహిళా అభ్యర్థి 521 ఓట్లతో విజయం సాధించి సంచలనం సృష్టించింది. అలాగే హరియానాలో చివరి రౌండ్ వరకు బీజేపీ, కాంగ్రెస్ నేత మధ్య హోరాహోరీ కనిపించింది. దీంతో ఆ రాష్ట్రం మొత్తం ఈ పోటీలో ఎవరు విజయం సాధిస్తారో తెలుసుకునేందుకు సాయంత్రం వరకు టీవీలకు అతుక్కొని పోయారు. చివరికి బీజేపీ అభ్యర్థి విజయం సాధించారు. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

హర్యానా రాష్ట్రంలోని ఉచన్ కలాన్ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థి దేవేందర్ చతర్ 32 ఓట్ల తేడాతో విజయం సాధించారు. మొదటి రౌండ్ నుంచి ఇరువురి మధ్య దోబుచులాడిన లీడ్.. చివరకు బీజేపీ అభ్యర్థికి విజయం సాధించింది. ఈ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ అభ్యర్థి దేవేందర్ కు 48,968 ఓట్లు రాగా కాంగ్రెస్ అభ్యర్థి బ్రిజేంద్రకు 48,936 ఓట్లు వచ్చాయి. దీంతో స్వల్ప తేడా ఉండటంతో పలుమార్లు ఓట్ల లెక్కింపు చేసిన అధికారలు కాంగ్రెస్ అభ్యర్థిపై బీజేపీ అభ్యర్థి దేవేందర్ 32 ఓట్ల తేడాతో విజయం సాధించినట్లు ప్రకటించారు. దీంతో ఉదయం నుంచి ఏర్పడిన సస్పెన్స్ కు తెరపడింది.


Similar News