తల్లి మరణం.. ఎన్నికల వేళ డిప్యూటీ సీఎం కూతురు సంచలన నిర్ణయం
లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి అనురాగ్ ఠాకూర్‌పై హమీర్‌పూర్ స్థానం నుంచి హిమాచల్ ప్రదేశ్ డిప్యూటీ సీఎం ముకేశ్ అగ్నిహోత్రి కుమార్తె ఆస్తా పోటీ చేయనున్న విషయం తెలిసిందే.
దిశ, వెబ్‌డెస్క్: లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి అనురాగ్ ఠాకూర్‌పై హమీర్‌పూర్ స్థానం నుంచి హిమాచల్ ప్రదేశ్ డిప్యూటీ సీఎం ముకేశ్ అగ్నిహోత్రి కుమార్తె ఆస్తా పోటీ చేయనున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆస్తా తల్లి అనారోగ్యంతో ఫిబ్రవరి 9 న మరణించింది. దీంతో తల్లి మరణాన్ని తట్టుకోలేకపోతున్నానని.. ఇంకా తన మదిలో ఆమె జ్ఞాపకాలే మెదులుతున్నాయని ఆస్తా తన ఫేస్ బుక్ ఖాతాలో ఓ వీడియో పోస్ట్ చేశారు. ఎన్నికల వేళ తల్లి మరణం నుంచి కోలుకోలేకపోతున్నానని ఇలాంటి సమయంలో ఎన్నికల బరిలో నిలవలేనని ఆస్తా వెల్లడించారు. ఈ విషాద సమయంలో లోక్‌సభకు, అసెంబ్లీకి వెళ్లాలనే కోరిక లేదని తెలిపారు. తండ్రి ముకేశ్ అగ్నిహోత్రి తనను ధైర్యం కోల్పోవద్దని చెబుతున్నారు.. కానీ తన తల్లి లేకుండా జీవించడం చాలా కష్టంగా ఉందని ఎమోషనల్ అయ్యారు. ఆమె జ్ఞాపకాలతో పోరాడుతున్నానని, తల్లి నివాళులు అర్పించే సమయం ఇదేనని, ఎన్నికల్లో పోటీ చేయనని ఆస్తా సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటివరకు తనకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి ఆస్తా ధన్యవాదాలు చెప్పుకొచ్చింది.