Cannabis Cultivation : గంజాయి సాగుకు చట్టబద్ధత.. అసెంబ్లీ సంచలన తీర్మానం

దిశ, నేషనల్ బ్యూరో : హిమాచల్‌ప్రదేశ్ అసెంబ్లీ శుక్రవారం సంచలన తీర్మానం చేసింది.

Update: 2024-09-06 14:32 GMT

దిశ, నేషనల్ బ్యూరో : హిమాచల్‌ప్రదేశ్ అసెంబ్లీ శుక్రవారం సంచలన తీర్మానం చేసింది. రాష్ట్రంలో గంజాయి సాగును చట్టబద్ధం చేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. అసెంబ్లీ కమిటీ సమర్పించిన నివేదికలోని సిఫార్సుల అమల్లో భాగంగా గంజాయి సాగుకు చట్టబద్ధత కల్పించే నిర్ణయాన్ని తీసుకున్నామని రాష్ట్ర సర్కారు వెల్లడించింది. ఔషధ, పారిశ్రామిక అవసరాలను తీర్చే సదుద్దేశంతోనే గంజాయి సాగుకు చట్టబద్ధత కల్పించామని తెలిపింది.

దీనివల్ల హిమాచల్‌ప్రదేశ్‌ రాష్ట్ర ఖజానాకు భారీ ఆదాయం సమకూరుతుందని పేర్కొంది. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయానికి విపక్షాలు కూడా మద్దతు పలికాయని రెవెన్యూ మంత్రి జగత్ సింగ్ నేగి వెల్లడించారు. జమ్మూకశ్మీర్, ఉత్తరాఖండ్, మధ్యప్రదేశ్‌లలో చట్టబద్ధంగా జరుగుతున్న గంజాయి సాగు నమూనాలను అధ్యయనం చేశాకే తమ రాష్ట్రంలోనూ ఆ పద్ధతిని పాటించాలని నిర్ణయించినట్లు ఆయన చెప్పారు.


Similar News