BREAKING: జార్ఖండ్ సీఎం పదవికి హేమంత్ సోరెన్ రాజీనామా
జార్ఖండ్ రాష్ట్ర రాజకీయాల్లో సంచలన పరిణామం చోటు చేసుకుంది. జార్ఖండ్ సీఎం పదవికి జేఎంఎం చీఫ్ హేమంత్ సోరెన్ రాజీనామా చేశారు. ఈ నేపథ్యంలో జీఎంఎం
దిశ, వెబ్‌డెస్క్: జార్ఖండ్ రాష్ట్ర రాజకీయాల్లో సంచలన పరిణామం చోటు చేసుకుంది. జార్ఖండ్ సీఎం పదవికి జేఎంఎం చీఫ్ హేమంత్ సోరెన్ రాజీనామా చేశారు. హేమంత్ సోరెన్ రాజీనామా నేపథ్యంలో జీఎంఎం ఎమ్మెల్యేలు శాసనపక్ష నేతగా చంపై సోరెన్‌ను ఎన్నుకున్నారు. ఈ క్రమంలో జార్ఖండ్ తదుపరి సీఎంగా చంపై సోరెన్ బాధ్యతలు చేపట్టనున్నారు. ఈ మేరకు చంపై సోరెన్ రాజ్ భవన్‌లో గవర్నర్‌తో భేటీ అయ్యారు. ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని కోరారు. జేఎంఎం ఎమ్మెల్యేలు రాజ్ భవన్‌కు చేరుకుంటున్నారు. కాగా, ల్యాండ్ స్కామ్ కేసులో మనీ లాండరింగ్ ఆరోపణలు ఎదుర్కొంటున్న హేమంత్ సోరెన్‌ను ఈడీ అరెస్ట్ చేస్తోందని పెద్ద ఎత్తున మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. మధ్యాహ్నం నుండి సీఎం హేమంత్ సోరెన్‌ను ప్రశ్నిస్తోన్న ఈడీ అధికారులు.. ఆయనను ఏ క్షణమైనా అరెస్ట్ చేసే అవకాశం ఉంది. ఈ క్రమంలో హేమంత్ సోరెన్ సీఎం పదవికి రాజీనామా చేయడం జార్ఖండ్ రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారింది.
Read More..
నిరుద్యోగులకు శుభవార్త.. రేపే కొత్త పోస్టులతో రీ నోటిఫికేషన్