helicopter crash: మహారాష్ట్రలో కూలిన హెలికాప్టర్.. హైదరాబాద్ వస్తుండగా ఘటన

హైదరాబాద్ కు వస్తుండగా హెలికాప్టర్ కుప్పుకూలిన ఘనట మహారాష్ట్రలో చోటు చేసుకుంది.

Update: 2024-08-24 10:26 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: భారీ వర్షాలు, బలమైన గాలుల కారణంగా మహారాష్ట్రలో ఓ ప్రైవేట్ హెలికాప్టర్ కుప్ప కూలింది. ముంబై లోని జుహు ప్రాంతం నుంచి హైదరాబాద్ కు వస్తున్న ఏఐ 139 అనే చాపర్ పుణెకు సమీపంలోని పౌడ్ ప్రాంతంలోని పంట పొలాల్లో క్రాష్ అయింది. ప్రమాదం సమయంలో కెప్టెంత్ సహా మొత్తం నలుగురు హెలికాప్టర్ లో ఉన్నట్లు తెలుస్తున్నది. ఈ ఘటనలో హెలికాప్టర్ లో ప్రయాణిస్తున్న వారికి తీవ్ర గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. కాగా ప్రమాదానికి గురైన హెలికాప్టర్ గ్లోబర్ వెక్ట్రా కంపెనీకి చెందినదిగా తెలుస్తున్నది. ఈ ఘటనకు సంంబధించిన పూర్తివివరాలు తెలియాల్సి ఉంది.


Similar News