మహారాష్ట్రలో భారీ వర్షాలు.. రెడ్ అలర్ట్ జారీ చేసిన ఐఎండీ

మహారాష్ట్రలోని థానే, పొరుగున ఉన్న పాల్ఘర్ జిల్లాల్లో బుధవారం అర్ధరాత్రి నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో భారీ వరదలు సంభవించాయి.

Update: 2024-06-20 07:17 GMT

దిశ, నేషనల్ బ్యూరో: మహారాష్ట్రలోని థానే, పొరుగున ఉన్న పాల్ఘర్ జిల్లాల్లో బుధవారం అర్ధరాత్రి నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో భారీ వరదలు సంభవించాయి. ఈ కారణంగా పాల్ఘర్‌లోని సూర్య నది మానేర్‌లోని ఒక వంతెన మునిగిపోయినట్టు జిల్లా విపత్తు నిర్వహణ విభాగం చీఫ్ వివేకానంద్ కదమ్ తెలిపారు. మరిన్ని అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించారు. ఈ నేపథ్యంలో భారత వాతావరణ శాఖ పాల్ఘర్ జిల్లాకు రెడ్ అలర్ట్ జారీ చేసింది.మరోవైపు థానేలో కురిసిన భారీ వర్షాల కారణంగా రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. గత 24 గంటల వ్యవధిలో నగరంలో 35.51 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైందని థానే మున్సిపల్ కార్పొరేషన్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ సెల్ చీఫ్ యాసిన్ తాడ్వి తెలిపారు. అక్కడక్కడ రోడ్లపై చెట్ల కూలిపోగా విద్యుత్ సరఫరాలకు అంతరాయం కలిగింది. దీంతో సహాయక చర్యలు చేపట్టినట్టు పేర్కొన్నారు. గతేడాది ఇదే కాలంలో థానేలో 50.70 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది.


Similar News