ప్రధాని మోడీ తల్లి ఆరోగ్య పరిస్థితిపై హెల్త్ బులిటెన్ విడుదల

ప్రధాని నరేంద్ర మోడీ తల్లి హీరాబెన్ ఆరోగ్యం క్షీణించడంతో అహ్మదాబాద్‌లోని యుఎన్ మెహతా ఆసుపత్రికి తరలించారు.

Update: 2022-12-28 09:03 GMT

దిశ, వెబ్‌డెస్క్: ప్రధాని నరేంద్ర మోడీ తల్లి హీరాబెన్ ఆరోగ్యం క్షీణించడంతో అహ్మదాబాద్‌లోని యుఎన్ మెహతా ఆసుపత్రికి తరలించారు. కాగా ఆమె ఆరోగ్యంపై యుఎన్ మెహతా ఆసుపత్రి వారు హెల్త్ బులిటెన్ ని విడుదల చేశారు. మోడీ తల్లి హీరాబెన్ ఆరోగ్యం నిలకడగా ఉందని తెలిపారు. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతుండటంతో ఆమెను ఆస్పత్రికి తరలించినట్లు అధికారులు తెలిపారు. కాగా ఆ రోజు సాయంత్రం ప్రధాని మోడీ అహ్మదాబాద్ వచ్చే అవకాశం ఉండటంతో అక్కడ కేంద్ర బలగాలు భద్రతను కట్టుదిట్టం చేశారు.


Similar News