ప్లాన్ ప్రకారమే హత్రాస్ ఘటన..భోలే బాబా తరఫు న్యాయవాది సంచలన వ్యాఖ్యలు

ఉత్తరప్రదేశ్‌లోని హత్రాస్ జిల్లాలో ఇటీవల జరిగిన తొక్కిసలాటలో 123 మంది మరణించిన విషయం తెలిసిందే. అయితే ఈ ఘటనకు సంబంధించి భోలె బాబా తరఫు న్యాయవాది ఏపీ సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

Update: 2024-07-07 14:02 GMT

దిశ, నేషనల్ బ్యూరో: ఉత్తరప్రదేశ్‌లోని హత్రాస్ జిల్లాలో ఇటీవల జరిగిన తొక్కిసలాటలో 123 మంది మరణించిన విషయం తెలిసిందే. అయితే ఈ ఘటనకు సంబంధించి భోలె బాబా తరఫు న్యాయవాది ఏపీ సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పక్కా ప్రణాళిక ప్రకారమే ఘటనకు కుట్ర పన్నారని ఆరోపించారు. సుమారు 16 మంది వ్యక్తులు కొందరిపై విషం చల్లి పారిపోయారని, దీని వల్లే తొక్కిసలాట జరిగిందని పేర్కొన్నారు. ఘర్షణను ప్రేరేపించిన అనంతరం నిందితులు వేదిక వద్ద నుంచి పారిపోయారని తెలిపారు. ‘తొక్కిసలాటలో మరణించిన వారిలో ఎక్కువ మంది మహిళలు ఉన్నారు. వారంతా ఊపిరాడక చనిపోయారని రిపోర్టులు చెబుతున్నాయి. తొక్కిసలాట జరిగిన ప్రదేశంలో కొన్ని గుర్తుతెలియని వాహనాలు ఉన్నాయి. ఘటనపై దర్యాప్తు చేస్తున్న సిట్ బృందం ఆ వాహనాలను సీసీటీవీ పుటేజీ ద్వారా గుర్తించి స్వాధీనం చేసుకోవాలి’ అని తెలిపారు. భోలే బాబాకు పెరుగుతున్న ప్రజాదరణను చూడలేకే కుట్ర చేశారని స్పష్టం చేశారు. 


Similar News

టమాటా @ 100