ముగిసిన హర్యానా పోలింగ్.. ఈ నెల 8న ఓట్ల లెక్కింపు

2024 పార్లమెంట్ ఎన్నికల తర్వాత మొదటిసారి అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి.

Update: 2024-10-05 12:52 GMT

దిశ, వెబ్ డెస్క్: 2024 పార్లమెంట్ ఎన్నికల తర్వాత మొదటిసారి అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. మొదట జమ్మూ, కాశ్మీర్ లో మూడు దశల్లో పోలింగ్ జరగ్గా, హర్యానాలోని 90 అసెంబ్లీ స్థానాలకు ఒకే విడతలో ఈ రోజు పోలింగ్ జరిగింది. కాగా సాయంత్రం 6 గంటలకు పోలింగ్ ముగియగా..క్యూ లైన్లలో నిల్చున్న వారికి ఓటు వేసేందుకు అధికారులు అవకాశం కలిగించారు. సాయంత్రం 5 గంటల వరకు 61 శాతం ఓటింగ్ నమోదవ్వగా.. పూర్తిస్థాయిలో ఓటింగ్ నమోదు పెరిగే అవకాశం ఉంది. కాగా ఈ రెండు రాష్ట్రాల ఎన్నికల ఓట్ల లెక్కింపు ఈ నెల 8న జరగనుండగా, మరికాసేపట్లో ఎగ్జిట్ పోల్స్ విడుదల కానున్నాయి. పార్లమెంట్ ఎన్నికల్లో ఇండియా కూటమి గతంతో పోలిస్తే భారీగా సీట్లను పెంచుకోవడంతో.. ఈ ఎన్నికలపై ఎటువంటి ప్రభావం చూపబోతుందని దేశ వ్యాప్తంగా చర్చ జరుగుతోంది. అలాగే కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ఈ రెండు రాష్ట్రాల్లో విజయం సాధించి తమకు తిరుగు లేదని.. నిరూపిస్తామని చెప్పుకొస్తోంది. ఏది ఏమైనప్పటికీ ఈ రెండు రాష్ట్రాల్లో ఎవరు గెలుస్తారో తెలియాలంటే.. ఈ నెల 8 వరకు వేచి చూడాల్సిందే మరి.


Similar News