Haryana elections: హర్యానా ఎన్నికల్లో ట్విస్ట్.. కాంగ్రెస్ అభ్యర్థికి ఆప్ క్యాండిడేట్ మద్దతు

నీలోఖేరి నుంచి పోటీ చేస్తున్న కాంగ్రెస్ అభ్యర్థి ధరంపాల్‌కు అదే సెగ్మెంట్ నుంచి బరిలో నిలిచిన ఆప్ అభ్యర్థి మద్దతు తెలిపారు.

Update: 2024-10-03 07:00 GMT

దిశ, నేషనల్ బ్యూరో: హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. నీలోఖేరి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న కాంగ్రెస్ అభ్యర్థి ధరంపాల్‌కు అదే సెగ్మెంట్ నుంచి బరిలో నిలిచిన ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) అభ్యర్థి అమర్ సింగ్ మద్దతు తెలిపారు. ఈ మేరకు గురువారం కాంగ్రెస్ పార్టీ ఓ ప్రకటనలో వెల్లడించింది. తమ పార్టీ అభ్యర్థికి మద్దతివ్వాలని అమర్‌సింగ్ నిర్ణయం తీసుకోవడం సంతోషకరమని పేర్కొంది. ఈ పరిణామంతో కాంగ్రెస్‌కు మరింత బలం చేకూరిందని తెలిపింది. ఎన్నికలకు రెండు రోజుల ముందే తమ అభ్యర్థి కాంగ్రెస్ పార్టీకి మద్దతుల తెలపడంతో ఆప్‌కు షాక్ తగిలినట్టు అయింది. కాగా, హర్యానాలోని మొత్తం 90 అసెంబ్లీ స్థానాలకు అక్టోబర్ 5న పోలింగ్ జరగనుంది. దీనికి సంబంధించి ఇప్పటికే ఈసీ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఈ నెల 8న ఫలితాలు వెల్లడి కానున్నాయి.


Similar News