Ashok Tanwar: బీజేపీకీ ట్విస్ట్ ఇచ్చిన మాజీ ఎంపీ.. ఐదేళ్లలో నాలుగో సారి పార్టీ చేంజ్

పార్టీలు మారడమే పనిగా పెట్టుకున్న మాజీ ఎంపీ సరిగ్గా ఎన్నికళ మరోసారి ట్విస్ట్ ఇచ్చారు.

Update: 2024-10-03 10:54 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: రాజకీయ నాయకులు పార్టీలు మారడం సహజమే. అయితే అదే పనిగా పార్టీలు మారుతుంటే.. అచ్చం అదే జరిగింది హర్యాణా ఎన్నికల వేళ. గంట క్రితం బీజేపీకి ఓట్లు వేయాలని బీజేపీ తరపున ర్యాలీలో ప్రసంగం చేసిన మాజీ ఎంపీ అశోక్ తన్వర్ అనూహ్యంగా కాంగ్రెస్ గూటికి చేరారు. గురువారం రాహుల్ గాంధీ సమక్షంలో ఆయన తిరిగి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. దీంతో గడిచిన ఐదేళ్లలో నాలుగోసారి పార్టీ మారిన అశోక్ తన్వర్ వ్యవహారం ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో చర్చగా మారింది. గతంలో కాంగ్రెస్ లో ఉన్న తర్వన్.. 2014-19 మధ్య కాలంలో హర్యానా కాంగ్రెస్ అధ్యక్షుడిగా పని చేశారు. 2019లో పార్టీ పతనంతో కాంగ్రెస్ కు రాజీనామా చేసి 2021 లో తృణమూల్ కాంగ్రెస్ లో చేరారు. ఆ పార్టీకి రాజీనామా చేసి 2022 లో ఆమ్ ఆద్మీ గూటికి చేరారు. ఈ ఏడాది ప్రారంభంలో ఆప్ కు రిజైన్ చేసి బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు.

గత లోక్ సభ ఎన్నికల్లో సిర్సా లోక్ సభ స్థానానికి పోటీ చేసి కాంగ్రెస్ అభ్యర్థి కుమారి సెల్జా చేతిలో ఓటమి పాలయ్యారు. ఈ క్రమంలో మరో ఐదు రోజుల్లో ఆ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయనగా కాంగ్రెస్ సభలో రాహుల్ గాంధీ, భూపిందర్ సింగ్ హుడా సమక్షంలో కాంగ్రెస్ లోకి వచ్చారు. జింద్ జిల్లాలోని సఫిడాన్ లో బీజేపీ అభ్యర్థి తరపున ప్రచారం చేసిన కొన్ని గంటలకే తన్వర్ కాంగ్రెస్ లో చేరడం హాట్ టాపిక్ గా మారింది.



Similar News